అమెరికా, రష్యాల నుంచి భారత్‌కు బారీ సాయం

April 29, 2021


img

అమెరికా, రష్యా, ఫ్రాన్స్ తదితర అగ్రదేశాలు భారత్‌కు భారీగా ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, వైద్య పరికరాలు, మందులు పంపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ హామీ ఇచ్చినట్లుగానే అమెరికా ప్రభుత్వం భారత్‌కు సుమారు రూ.744 కోట్లు విలువైన ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, వైద్య పరికరాలు, మందులు, వాక్సిన్లు పంపిస్తోంది. ఇప్పటికే 1,700 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, 1,100 ఆక్సిజన్‌ సిలెండర్లు, వైద్య పరికరాలు, 1.5 లక్షల ఎన్‌95 మాస్కులు, 9.5 లక్షల ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ ఇంకా కరోనా చికిత్సకు అవసరమైన మందులు వగైరా తీసుకొని కాలిఫోర్నియా నుంచి ప్రత్యేక విమానాలు భారత్‌కు బయలుదేరాయి. 

తాజాగా రష్యా నుంచి రెండు భారీ రవాణా విమానాలు ఢిల్లీకి చేరుకొన్నాయి. వాటిలో 20 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, 75 వెంటిలేటర్లు, 150 మానిటర్లు, ఇతర వైద్య పరికరాలు, 225 టన్నుల మందులను రష్యా పంపించింది. ఫ్రాన్స్ నుంచి కూడా ప్రత్యేక విమానాలలో ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, వైద్య పరికరాలు, మందులు భారత్‌కు వస్తున్నాయి. 

కరోనా కష్టకాలం ఎదుర్కొంటున్న భారత్‌కు అగ్రరాజ్యాలు సకాలంలో అందిస్తున్న ఈ సాయం ఎంతో అమూల్యమైనది. ఎంతో మంది ప్రాణాలు కాపాడుతాయి. అయితే విదేశాల నుంచి అందుతున్న ఈ వైద్య సామాగ్రిని, మందులను భారత్‌ ఎంతవరకు సద్వినియోగం చేసుకొంటుందనేదే ప్రశ్న. ఎందుకంటే, ప్రతీదానిపై రాజకీయాలు చేస్తూ, ప్రతీదీ రాజకీయకోణంలో నుంచే చూస్తూ నిర్ణయాలు, చర్యలు తీసుకొనే ప్రభుత్వాల దురలవాటే అందుకు కారణంగా చెప్పవచ్చు. విదేశాల నుంచి అందుతున్న వీటిని రాజకీయాలకు, బ్యూరోక్రసీకి అతీతంగా వేగంగా అవసరమైన రాష్ట్రాలకు పంపించినప్పుడే అవి సద్వినియోగం అవుతాయి లేకుంటే ఎంత సాయం అందినా అది నిరుపయోగమే అవుతుంది. 



Related Post