కోవాక్సిన్ కరోనాను సమర్ధంగా అడ్డుకొంటోంది: అమెరికా

April 28, 2021


img

హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్ కంపెనీ తయారుచేసిన కోవాక్సిన్ కరోనాను సమర్ధంగా అడ్డుకొంటున్నట్లు తమ పరిశీలనలో తేలింది. ఈవిషయం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రధాన వైద్య సలహాదారు, కరోనా కట్టడికి ఏర్పాటుచేసిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌కు నేతృత్వం వహిస్తున్న డాక్టర్ ఆంథోనీ ఫౌసీ చెప్పారు. 

భారత్‌లో కొవాక్సిన్ టీకాలు ఇచ్చిన ప్రాంతాలలో కరోనా కేసుల సంఖ్య స్థిరంగా ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. రెండో దశ కరోనాను కోవాక్సిన్ సమర్ధంగా అడ్డుకొంటున్నట్లు డేటాను విశ్లేషించి తెలుసుకొన్నామని చెప్పారు. భారత్‌లో రెండో దశ కరోనాను కట్టడికి ఏకైక మార్గం అందరూ టీకాలు వేయించుకోవడమే అని డాక్టర్ ఆంథోనీ ఫౌసీ అన్నారు. 

 అమెరికాకు చెందిన ఆస్ట్రాజెనికా కంపెనీ కోవీషీల్డ్ వాక్సిన్‌ను తయారుచేయగా, పూణేలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా ఆ కంపెనీతో ఒప్పందం చేసుకొని కోవీషీల్డ్ వాక్సిన్లను భారీ స్థాయిలో ఉత్పత్తి చేస్తూ యావత్ భారతదేశానికి అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే డాక్టర్ ఆంథోనీ ఫౌసీ అమెరికా కంపెనీ తయారుచేసిన కోవీషీల్డ్ వాక్సిన్‌ కంటే భారత్‌లో తయారైన కోవాక్సిన్‌ సమర్ధంగా పనిచేస్తోందని చెప్పడం విశేషం. రెండు వ్యాక్సిన్లు సమర్ధంగా పనిచేస్తున్నప్పటికీ వాటిలో భారత్‌ బయోటెక్ కంపెనీ తయారుచేసిన కోవాక్సిన్ మరింత సమర్ధంగా కరోనాను అడ్డుకొంటోందని వస్తున్న వార్తలను డాక్టర్ ఆంథోనీ ఫౌసీ దృవీకరిస్తునట్లయింది.


Related Post