సాగర్ బందోబస్తు బాధితులు 32 మంది

April 27, 2021


img

ఇటీవల జరిగిన నాగార్జునసాగర్ ఉపఎన్నికలకు నిజామాబాద్‌ నుంచి ఓ ఏసీపీ, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలు, 105 మంది పోలీసులు బందోబస్తుకు వెళ్ళారు. అక్కడ వారు 16 రోజులపాటు విధులు నిర్వహించి తిరిగివచ్చారు. తిరిగి రాగానే వారిలో ఒకరొకరిగా కరోనా బారిన పడ్డారు. ఇప్పటివరకు వారిలో మొత్తం 32 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. వారి ద్వారా వారి కుటుంబ సభ్యులలో కొందరికి కరోనా సోకింది. వారిలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నవారిని ఆసుపత్రులలో మిగిలినవారిని హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. వారిలో 17 మంది కోలుకోగా మిగిలినవారికి ఇంకా చికిత్స కొనసాగుతోంది. వారికి ధైర్యం చెప్పేందుకు సీపీ కార్తికేయ ఓ వాట్సాప్‌ గ్రూపును క్రియేట్ చేసి నిత్యం వారితో టచ్‌లో ఉంటూ వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొంటున్నారు. ఆయనతో పాటు జిల్లాకు చెందిన పోలీస్ ఉన్నతాధికారులు కూడా వారితో నిత్యం మాట్లాడుతూ ధైర్యం చెపుతున్నారు. అయితే ఇది నిజామాబాద్‌ ఒక్క జిల్లాకు మాత్రమే పరిమితమైన సమస్య కాదని చెప్పవచ్చు. ఎందుకంటే ఇతర జిల్లాల నుంచి వందలాదిమంది పోలీస్ సిబ్బంది నాగార్జునసాగర్ ఉపఎన్నికల బందోబస్తులో పాల్గొన్నారు. వారూ సాగర్ బాధితులే అనుకోకతప్పదు.


Related Post