మహారాష్ట్రలో కరోనా కేసులు, మరణాలు అంతకంతకూ పెరిగిపోతుండటంతో అక్కడి ప్రభుత్వం ఈనెల 15వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది. అయినప్పటికీ మొన్న మహారాష్ట్రలో కొత్తగా 62,097 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కర్ఫ్యూతో కరోనా ఉదృతి తగ్గకపోవడంతో గురువారం రాత్రి నుంచి మే 1వ తేదీ వరకు సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తున్నట్లు మహా ప్రభుత్వం ప్రకటించింది. తప్పనిసరి పరిస్థితులలోనే సంపూర్ణ లాక్‌డౌన్ విదించవలసి వచ్చిందని కనుక ప్రజలందరూ సహకరించాలని మహా ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే విజ్ఞప్తి చేశారు.
లాక్‌డౌన్ చివరి అస్త్రమని కనుక చేజేతులా అటువంటి పరిస్థితులు తెచ్చుకోవద్దని ప్రధాని నరేంద్రమోడీ చెప్పిన 24 గంటలలోనే మహారాష్ట్రలో పరిస్థితులు అదుపుతప్పి సంపూర్ణ లాక్‌డౌన్ విధించవలసివచ్చింది.