ఏపీలో ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్

April 16, 2021


img

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని వివిద శాఖలు, విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ఏటా నిర్ధిష్ట సమయంలో భర్తీ చేసేందుకు వీలుగా క్యాలెండర్ రూపొందించాలని టిజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం చాలా ఏళ్ళుగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు కానీ ఆయన సూచనను ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఉద్యోగాల భర్తీకి పక్కా క్యాలెండర్ రూపొందించడానికి అక్కడి ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. 

ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌ వివిదశాఖల ముఖ్యకార్యదర్శులతో సమావేశమై ఆయా శాఖలు, విభాగాలలో ఖాళీల వివరాలు తెలియజేయాలని ఆదేశించారు. వివిద శాఖలలో ఖాళీగా ఉన్న వివిద పోస్టులకు సంబందించి పూర్తి వివరాలను డైరెక్టరీ ఆఫ్‌ పోస్ట్స్‌ అండ్‌ పర్సనల్‌ విభాగానికి తెలియజేయాలని ఆదేశించారు. వీటిలో గ్రూప్ 1,2,3,4 కేటగిరీలవారీగా ఎన్ని ఖాళీలు ఉన్నాయో డైరెక్టరీ ఆఫ్‌ పోస్ట్స్‌ అండ్‌ పర్సనల్‌ అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. ఆ వివరాల ఆధారంగా ఒక్కో శాఖ, విభాగాల వారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు వీలుగా ఓ క్యాలెండర్ రూపొందించి మే 31న విడుదల చేయబోతునట్లు తెలిపారు.


Related Post