అప్పుడే తెలంగాణ ప్రభుత్వానికి సవాళ్ళా?

April 15, 2021


img

వైఎస్ షర్మిల ఇవాళ్ళ ఇందిరా పార్కులోని ధర్నా చౌక్ వద్ద రాష్ట్రంలో నిరుద్యోగా యువతకు మద్దతుగా దీక్ష చేస్తున్నారు. పోలీసులు ఆమెకు ఈరోజు సాయంత్రం 5 గంటల వరకే అనుమతించినప్పటికీ తాను 72 గంటలు దీక్ష చేయబోతున్నట్లు ఆమె ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్‌ జారీ చేయకపోవడంతో యువత చాలా నిరాశనిస్పృహలతో ఉన్నారని, ఉద్యోగాలు దొరక్క ఆత్మహత్యలు చేసుకొంటున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బలవన్మరణాలకు పాల్పడుతుంటే సిఎం కేసీఆర్‌ స్పందించకుండా ఎన్నికల హడావుడిలో మునిగితేలుతున్నారని షర్మిల ఆరోపించారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతను పట్టించుకొనే నాధుడే లేడని, కనుక వారి తరపున తాను రాష్ట్ర ప్రభుత్వంతో  పోరాడేందుకు ముందుకు వచ్చానని షర్మిల అన్నారు. ఒకవేళ ఈ అంశంపై స్పందించకపోతే తన ఉద్యమం ఉదృతం చేసి రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, దీక్షలు చేపడతామని వైఎస్ షర్మిల తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.  

తద్వారా ఇంకా పార్టీ స్థాపించక మునుపే ఆమె పోలీసులకు, తెలంగాణ ప్రభుత్వానికి, సిఎం కేసీఆర్‌కు సవాళ్ళు విసురుతున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఆమె దీక్షను ముగించవలసి ఉండగా 72 గంటలు దీక్ష చేస్తానని చెప్పినందున, మరికొద్ది సేపటిలో ఆమెకు, అనుచరులకు, పోలీసులకు  మద్య ఘర్షణ జరిగే అవకాశం ఉంది.



Related Post