అవును...ఈ ఫోటో చూస్తే ఎక్కడో విదేశంలో తీసిందనుకొంటారు కానీ కాదు మన తెలంగాణ రాష్ట్రంలోనే...సిద్ధిపేట జిల్లా కేంద్రంలో అభివృద్ధి చేసిన కోమటిచెరువు ఇది. తెలంగాణ ఆర్ధికశాఖ మంత్రి హరీష్‌రావు ప్రత్యేక శ్రద్ద తీసుకొని పట్టణంలోని కోమటిచెరువును హైదరాబాద్‌లో ట్యాంక్ బండ్ కంటే అద్భుతంగా తీర్చిదిద్దారు. కోమటి చెరువు ఒడ్డున అందమైన పార్కు, అక్కడే రంగురంగుల లైట్ల మద్య మ్యూజికల్ ఫౌంటెయిన్‌ను ఏర్పాటు చేయించారు.
మంత్రి హరీష్‌రావు కోమటి చెరువు పార్కులో బుదవారం మ్యూజికల్ ఫౌంటెయిన్‌ను దాంతోబాటు లేక్ ఫెస్టివల్‌ను ప్రారంభించారు. కళ్ళు చేయిదిరిపోయేలా అత్యద్భుతంగా జరిగిన ఈ కార్యక్రమాన్ని చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. కోమటి చెరువులో బోటింగ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు.
మ్యూజికల్ ఫౌంటెయిన్ ప్రారంభోత్సవం చేసిన తరువాత మంత్రి హరీష్‌రావు కోమటిచెరువులో స్వయంగా బోట్ నడిపారు. కోమటి చెరువులో బోటింగ్ సౌకర్యం, పార్కులో మ్యూజికల్ ఫౌంటెయిన్ వగైరాలు ఏర్పాటు చేయడంతో ఇప్పుడు రాష్ట్రంలో ఇదొక పర్యాటక ఆకర్షణ కేంద్రంగా మారనుంది.