కేంద్ర ప్రధాన ఎన్నికల కమీషనర్‌గా సుశీల్ చంద్ర

April 12, 2021


img

కేంద్ర ఎన్నికల కమీషన్‌ ముగ్గురు సభ్యులలో ఒకరైన సుశీల్ చంద్ర ప్రధాన ఎన్నికల కమీషనర్‌గా నియమితులు కానున్నారు. ప్రస్తుతం ప్రధాన ఎన్నికల కమీషనర్‌గా ఉన్న సునీల్ అరోరాకు నేటితో పదవీకాలం పూర్తవుతుంది. కనుక ఆనవాయితీ ప్రకారం ఆయన స్థానంలో కమీషన్‌లో సీనియర్ అయిన సుశీల్ చంద్రను ప్రధాన ఎన్నికల కమీషనర్‌గా నియమితులు కానున్నారు. నేడు రాష్ట్రపతి కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడితే మంగళవారం ఆయన ప్రధాన ఎన్నికల కమీషనర్‌గా బాధ్యతలు చేపడతారు. సుశీల్ చంద్ర పదవీ కాలం 2022, మే 14 వరకు ఉంటుంది. ఆయన ఎన్నికల కమీషన్‌లో చేరకమునుపు కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి ఛైర్మన్‌గా వ్యవహరించారు. 



Related Post