తెలంగాణలో ఆటోమోబైల్ షాపులు సాయంత్రం బంద్‌

April 11, 2021


img

తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ కరోనా మహమ్మారి విజృంభిస్తున్నందున రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆటోమోబైల్ స్పేర్ పార్ట్స్ దుకాణాలను ప్రతీరోజు సాయంత్రం 6.30 గంటలకు మూసివేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఆటోమోబైల్ స్పేర్ పార్ట్స్ దుకాణాల అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గుప్తా ప్రకటించారు. సోమవారం నుంచి దీనిని అమలుచేస్తామని తెలిపారు. 

హైదరాబాద్‌ బేగంబజార్‌లోని హోల్ సేల్ దుకాణాలను కూడా కరోనా కారణంగానే సాయంత్రం 6 గంటలు మూసివేస్తున్నారు. నగరంలో ఇంకా అనేక దుకాణాలు స్వచ్ఛందంగా సాయంత్రం మూసివేస్తున్నారు. లాక్‌డౌన్‌ విధిస్తే అటు వివిద సంస్థలు, వాటిలో పనిచేసే లక్షలాదిమంది ఉద్యోగులు, ప్రజలు కూడా ఇబ్బంది పడతారు. ప్రభుత్వ ఆదాయం కూడా తగ్గిపోతుంది. కనుక కరోనా కేసులు ఎంతగా పెరుగుతున్నా ఈసారి లాక్‌డౌన్‌ విధించేందుకు ప్రభుత్వం, సంస్థలు కూడా ఇష్టపడటం లేదు. లాక్‌డౌన్‌ విధించకుండా కరోనా కట్టడి చేయాలంటే రాష్ట్రవ్యాప్తంగా అన్నిటినీ ఇదేవిదంగా సాయంత్రం 6 గంటల నుంచి మూసివేసినట్లయితే రోడ్లపైకి జనాలు రావడం తగ్గుతుంది. దాంతో కరోనా వ్యాప్తి కూడా కొంతమేర తగ్గుతుంది కదా?     



Related Post