ఇక కరోనాతో ఎప్పటికీ కలిసి జీవించకతప్పదా?

April 08, 2021


img

పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో మళ్ళీ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత 24 గంటలలో ఏపీలో 2,558 మంది కరోనా బారినపడగా ఆరుగురు కరోనాతో మృతి చెందారు. ఈసారి కూడా అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 465, గుంటూరులో 399, కర్నూలులో 344, నెల్లూరులో 204, విశాఖపట్నంలో 290 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏపీలో ఇప్పటివరకు మొత్తం 9,12, 937 పాజిటివ్ కేసులు నమోదు కాగా వారిలో 8,90,756 మంది కోలుకొన్నారు. ఏపీలో ప్రస్తుతం 14,913 యాక్టివ్ కేసులున్నాయి. ఏపీలో కరోనా వ్యాపిస్తున్న తీరు చూస్తుంటే ఈనెలాఖరులోగా భారీగా కేసులు నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 

ప్రపంచంలో ఏ దేశంలో కరోనా మిగిలినా అది ఇతర దేశాలకు వ్యాపిస్తుంటుంది. అలాగే దేశంలో ఏ రాష్ట్రంలో కరోనా మహమ్మారి మిగిలి ఉన్నప్పటికీ అది మళ్ళీ మళ్ళీ ఇరుగుపొరుగు రాష్ట్రాలకు వ్యాపిస్తూనే ఉంటుంది. కనుక ఈ సమస్య ఎప్పటికీ పునరావృతం అవుతూనే ఉంటుందని భావించవచ్చు. కనుక కరోనాను పూర్తిగా నిర్మూలిస్తే తప్ప ఇప్పట్లో అది మనల్ని విడిచిపెట్టే అవకాశం లేదనే భావించవచ్చు. కానీ ఎప్పటికప్పుడు కొత్తరూపాలతో విజృంభిస్తున్న కరోనా మహమ్మారిని పూర్తిగా తుడిచిపెట్టడం సాధ్యమయ్యే పనేనా? అంటే సమాధానం దొరకదు. కనుక కరోనాతో కలిసి జీవిస్తూ రోజువారీ పనులు చేసుకోవడం అలవాటు చేసుకోక తప్పదేమో? 


Related Post