22 మందిని చంపి సంతాపం!

April 07, 2021


img

బీజాపూర్‌లో మావోయిస్టులు ఓ పధకం ప్రకారం చేసిన దాడిలో 22 మంది జవాన్లు మరణించగా 30 మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే. రాకేశ్వర్ సింగ్‌ అనే ఓ జవాను ప్రస్తుతం మావోయిస్టుల బందీగా ఉన్నాడు. అతనిని విడిపించేందుకు ఛత్తీస్‌ఘడ్‌ ప్రభుత్వం, కేంద్రప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టాయి. దీనిపై మావోయిస్ట్ కమిటీ స్పందిస్తూ నిన్న ఓ లేఖ విడుదల చేసింది.

దానిలో “రాకేశ్వర్ సింగ్‌ మా వద్ద సురక్షితంగా ఉన్నాడు. పోలీసులతో మేము నిత్యం పోరాడుతున్నప్పటికీ వారిని మేము శత్రువులుగా భావించడం లేదు. ప్రభుత్వానికి, మాకు మద్య జరుగుతున్న సైద్దాంతికపోరులో వారి బలవుతుండటం మాకు బాధ కలిగిస్తోంది. మొన్న జరిగిన ఎదురుకాల్పులలో మా సహచరులు నలుగురు మరణించారు. ఆ ఘటనలో మరణించిన 22 మంది జవాన్ల కుటుంబాలకు మా ప్రగాడ సంతాపం, సానుభూతి తెలుపుతున్నాము. రాష్ట్ర ప్రభుత్వం మద్యవర్తుల విషయంలో స్పష్టత ఇస్తే మావద్ద ఉన్న రాకేశ్వర్ సింగ్‌ను అప్పజెప్పడానికి సిద్దంగా ఉన్నాము,” అని పేర్కొన్నారు. 



Related Post