భారత్‌లో తీవ్రస్థాయికి చేరిన కరోనా

April 05, 2021


img

గత ఏడాది భారత్‌లో కరోనా తీవ్రరూపం దాల్చినప్పుడు ఒకేరోజున 97,894 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఈ ఏడాది ఏకంగా లక్ష కేసులు దాటిపోయాయి. గడిచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా కొత్తగా 1,03,558 పాజిటివ్ కేసులు  నమోదయ్యాయి. నిన్న సుమారు 9 లక్షల మందికి పరీక్షలు చేయగా వారిలో లక్షమందికి కరోనా సోకినట్లు తేలింది. గత 24 గంటలలో దేశవ్యాప్తంగా 52,847 మంది కోలుకోగా, మరో 478 మంది కరోనాతో చనిపోయారు. వారిలో 222 మంది మహారాష్ట్రలో వారే కావడం ఆ రాష్ట్రంలో కరోనా తీవ్రతకు అద్దంపడుతోంది.

తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఒక కోటి 26 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం సుమారు ఏడున్నర లక్షల యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఒక లక్షా 65 వేల మంది కరోనాకు బలయ్యారు. సుమారు ఒక కోటి పదిహేడు లక్షల మంది కరోనా నుంచి బయటపడ్డారు. ఇప్పటివరకు కేంద్రప్రభుత్వం సుమారు 8 కోట్ల టీకాలు పంపిణీ చేయగా దేశవ్యాప్తంగా మొత్తం 16.5 లక్షల మంది కరోనాకు టీకాలు వేసుకొన్నారు.  దేశంలో కరోనా విజృంభిస్తుండటంతో కరోనా టీకాల ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. 


Related Post