తెలంగాణలో మరో రెండు కొత్త పార్టీలు?

April 04, 2021


img

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో మరో రెండు కొత్త పార్టీలు ఆవిర్భవించనున్నాయి. ఒకటి వైఎస్ షర్మిళ, రెండోది కాంగ్రెస్‌ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్థాపించబోయేది. షర్మిళ ఏప్రిల్ 9వ తేదీన ఖమ్మంలో లక్షమందితో నిర్వహించబోయే ‘సంకల్ప సభ’ తన పార్టీ వివరాలను వెల్లడించబోతున్నారు. 

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్‌తో పోరాడే స్థితిలో లేదని, పోరాటపటిమ కోల్పోయిందని అన్నారు. కనుక కాంగ్రెస్‌తో తన లక్ష్యం నెరవేరదని భావించి బయటకువచ్చేశానని కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో టిఆర్ఎస్‌ను వ్యతిరేకిస్తున్నవారినందరినీ ఒక్కత్రాటిపైకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నానని, ఒకవేళ అందరూ కలిసివస్తే కొత్తపార్టీ పెడతానని లేకుంటే బిజెపిలో చేరిపోతానని చెప్పారు. టిఆర్ఎస్‌ నేతలు రాష్ట్రాన్ని విచ్చలవిడిగా దోచుకొంటున్నారని వారి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకొనేందుకే ఈ ప్రయత్నాలు చేస్తున్నట్లు కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో టిఆర్ఎస్‌ కోవర్టులున్నారని కనుక వారివల్లే పార్టీ రాజకీయంగా పతనం అవుతోందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. మరికొన్ని రోజులలో తన ఈ ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో తేలిపోతుందని అప్పుడు తన భవిష్య కార్యాచరణను ప్రకటిస్తానని కొండా విశ్వేశ్వర్ రెడ్డి శనివారం తాండూరుకి వచ్చినప్పుడు చెప్పారు. 


Related Post