రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకొంటాము: మంత్రి హరీష్‌

March 27, 2021


img

కేంద్రప్రభుత్వం దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడులను ఉపసంహరించుకొని వాటిని ప్రైవేట్ పరమ్ చేస్తుండటంతో దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. కానీ కేంద్రప్రభుత్వం పట్టించుకోవడం లేదు. స్థానిక బిజెపి నేతలు తమ ప్రభుత్వ నిర్ణయాన్ని అయిష్టంగానైనా సమర్ధించుకోక తప్పడం లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉన్న సింగరేణి వంటి సంస్థలను ఎన్నటికీ అమ్మబోమని వాటిని రాష్ట్ర సంపత్తిగా భావించి కాపాడుకొంటామని మంత్రి హరీష్‌రావు నిన్న శాసనసభలో తెలిపారు.

ఒక్కో ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆదాయం సమకూర్చుకొనేందుకు ఏదో ఓ సాకుతో ఈవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలను, ప్రభుత్వ భూములను అమ్ముకొంటూ, విచ్చలవిడిగా అప్పులు చేస్తుంటే చివరికి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల వద్ద సొంతంగా ఆస్తులు, ఆదాయ మార్గాలు మిగలవు. అప్పుడు ఏమి అమ్ముకొంటారు? ఎక్కడి నుంచి ఆదాయం సమకూర్చుకొంటారు? అని రేపటి గురించి ఆలోచన లేకుండా ఎవరికివారు ఈవిదంగా వ్యవహరిస్తుంటే మున్ముందు దేశం పరిస్థితి ఏమిటి?అధికారం చేజిక్కించుకొనేందుకు ఆచరణసాధ్యం కానీ హామీలను గుప్పించడం, వాటిని అమలుచేయడానికి అత్యంత విలువైన ప్రభుత్వ ఆస్తులను అమ్ముకోవడం, అప్పులు చేయడం ఎంతవరకు సమంజసం?ఒక పార్టీ లేదా దాని అధ్వర్యంలో నడిచే ఒక ప్రభుత్వం సొంత ప్రయోజనాల కోసం దేశం... ప్రజల భవిష్యత్‌ పణంగా పెట్టడం ఎంతవరకు సమంజసం?




Related Post