పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు దాగుడుమూతలు

March 25, 2021


img

ప్రాంతీయపార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతుంటే పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెంచేస్తోందని కేంద్రప్రభుత్వాన్ని విమర్శిస్తుంటాయి. కానీ రాష్ట్రాలే వీటిపై భారీగా పన్నులు వసూలు చేసుకొంటున్నాయని, అవి ఆ ఆదాయాన్ని వదులుకోవడానికి ఇష్టపడటం లేదని కేంద్రప్రభుత్వం ఆరోపిస్తుంటుంది. ఈవిధంగా ఈ ఉత్పత్తులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యధేచ్చగా పన్ను వసూలుచేసుకొంటూ పరస్పరం ఆరోపించుకొంటూ కాలక్షేపం చేస్తున్నాయే తప్ప వీటిని జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు ఇష్టపడటం లేదు. వాటిపై కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి ఏకంగా 60 శాతం పన్ను దండుకొంటున్నాయి. ఆ భారమంతా దేశ ప్రజలే మోయవలసివస్తోంది. 

ఈ మూడు ఉత్పత్తులను జీఎస్టీలోకి తీసుకురావడంపై రాజ్యసభలో జరిగిన చర్చలో బిజెపి సభ్యుడు సుశీల్ మోడీ మాట్లాడుతూ, “వీటిని జీఎస్టీలోకి తీసుకువచ్చేందుకు రాష్ట్రాలే ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే రాష్ట్రాలకు ఏటా దీని ద్వారా రూ.2 లక్షల కోట్లు ఆదాయం వస్తోంది. ఆ ఆదాయాన్ని తగ్గించుకొనేందుకు, కోల్పోయేందుకుకు ఏ రాష్ట్రమూ ఇష్టపడటం లేదు. ప్రాంతీయ పార్టీలు బహిరంగ సభలలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల గురించి మాట్లాడుతుంటాయి కానీ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆ ప్రస్తావనే చేయవు. ఒకవేళ ఈ మూడు ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెస్తే గరిష్టంగా 28 శాతం పన్ను మాత్రమే వేయవచ్చు. అప్పుడు వాటి ధరలు 60 శాతం వరకు తగ్గుతాయి. కానీ రాష్ట్రాలు ముందుకు రాకపోవడం వలన ఇప్పట్లో వాటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకురాలేము. బహుశః మరో 8-10 ఏళ్ళ తరువాత సాధ్యమవుతుందేమో?” అని అన్నారు.


Related Post