నేడు ఏపీలో మరో విమానాశ్రయం ప్రారంభం

March 25, 2021


img

ముప్పై మూడు జిల్లాలున్న తెలంగాణ రాష్ట్రానికి ఒకే ఒక విమానాశ్రయం శంషాబాద్‌లో ఉంది. బేగంపేట విమానాశ్రయం ఉంది కానీ అది కేవలం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్లు, కేంద్రమంత్రులు, వాయుసేనకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కానీ 13 జిల్లాల ఏపీలో వైజాగ్, రాజమండ్రి, గన్నవరం, రేణిగుంట (తిరుపతి) నాలుగు విమానాశ్రయాలున్నాయి. కర్నూలులో కొత్తగా ఏర్పాటుచేసిన మరో విమానాశ్రయాన్ని ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభించనున్నారు. దీంతో కలిపి ఏపీలో మొత్తం 5 విమానాశ్రయాలు అవుతాయి. 

వరంగల్‌లో విమానాశ్రయం ఏర్పాటుకు అవసరమైన భూములు, సహకారం అందించేందుకు సిద్దంగా ఉన్నామని తెలంగాణ ప్రభుత్వం పదేపదే చెపుతోంది. కేంద్రానికి అవసరమైనప్పుడల్లా టిఆర్ఎస్‌ ఎంపీలు మద్దతు ఇస్తున్నారు. ఏపీతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. తెలంగాణ ఏర్పడి ఏడేళ్ళు కావస్తున్నా ఇంతవరకు వరంగల్‌లో విమానాశ్రయం ఏర్పాటుచేయలేదు. ఇంకా ఎప్పుడు చేస్తుందో కూడా తెలీని పరిస్థితి. దక్షిణాది రాష్ట్రాలలో అత్యధికంగా పన్నుల రూపేణా కేంద్రానికి భారీగా ఆదాయం అందిస్తున్న తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్రప్రభుత్వం ఎందుకు ఇంత వివక్ష చూపుతోందో తెలీదు కానీ రాష్ట్రానికి ఏమీ చేయకుండానే రాష్ట్రంలో అధికారంలోకి రావాలని బిజెపి నేతలు తహతహలాడుతుండటం ఆశ్చర్యకరం. 

కర్నూలు-చెన్నై- కర్నూల్, కర్నూల్-బెంగళూరు-కర్నూల్, కర్నూల్-వైజాగ్-కర్నూల్ మద్య ఇండిగో సంస్థ రెండేళ్ళపాటు విమానాలు నడుపబోతోంది. లాభసాటిగా ఉంటే వాటిని ఆ తరువాత కూడా కొనసాగిస్తుంది.


Related Post