కరోనా కట్టడికి తాజా మార్గదర్శకాలు జారీ

March 23, 2021


img

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో కరోనా తీవ్రత మళ్ళీ పెరిగిపోవడంతో కేంద్ర హోంశాఖ నేడు అన్ని రాష్ట్రాలకు తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి వీటిని ఖచ్చితంగా అమలుచేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. 

• రద్దీ ప్రాంతాలు, బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాలు కరోనా నిబంధనలు ఖచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలి. మాస్క్‌లు, భౌతిక దూరం, శానిటైజర్‌ వినియోగం పెంచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నవారిపై  జరిమానాలు విధించాలి.

• ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షలు 70శాతంకు పెంచాలి. 

• వైరస్‌ తీవ్రతను బట్టి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మరిని ఆంక్షలు, చర్యలు తీసుకోవచ్చు. 

• పాజిటివ్‌ వచ్చిన వారిని క్వారంటైన్‌లో ఉంచి వైద్యం అందించాలి. పాజిటివ్‌ బాధితులు ఎవరెవరిని కలిశారో ట్రేసింగ్‌ చేయాలి. కేసులు అధికంగా ఉంటే కంటైన్మెంట్‌ జోన్‌లుగా ప్రకటించాలి. ఆ జోన్‌లో ఇంటింటి సర్వే చేసి పరీక్షలు చేయాలి. 

• విద్యాలయాలు, కార్యాలయాలు, రవాణా, హోటళ్లు, రెస్టారెంట్లు, థియేటర్లు ఉద్యానవనాలు, జిమ్‌ కేందద్రాలు తదితర ప్రాంతాల్లో కరోనా నిబంధనలు విధిగా పాటించాలి. 

• వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి 45 ఏళ్ళు అంతకంటే ఎక్కువ వయసున్న వారందరికీ కరోనా వ్యాక్సిన్‌ వేసుకోవచ్చు.    

• అంతరాష్ట్ర రాకపోకలపై ఎటువంటి నిషేదమూ లేదు. కనుక అంతరాష్ట్ర  ప్రజారవాణా, సరుకు రవాణాలకు ఎటువంటి అనుమతులు అవసరం లేదు. 

• అంతర్జాతీయ పౌరవిమాన సేవలపై విధించిన నిషేదాన్ని ఏప్రిల్ 30 వరకు పొడిగించబడింది.  

ఈ మార్గదర్శకాలు ఏప్రిల్‌ 1 నుంచి 30 వరకు వర్తిస్తాయని కేంద్ర హోంశాఖ తెలిపింది.


Related Post