కేరళలో కత్తులు...బెంగాల్‌లో పొత్తులు

March 19, 2021


img

కేరళ, పశ్చిమ బెంగాల్‌ శాసనసభలకు ఇంచుమించు ఒకే సమయంలో ఎన్నికలు జరుగుతుండటంతో కాంగ్రెస్ పార్టీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తోంది. కేరళలో అయితే...లెఫ్ట్ కూటమి లేకుంటే...కాంగ్రెస్‌ కూటమి మద్య దశాబ్ధాలుగా అధికార మార్పిడి జరుగుతోంది. ప్రస్తుతం లెఫ్ట్ కూటమి అధికారంలో ఉంది కనుక ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్‌ కూటమికి కలిసివచ్చే అవకాశం ఉంది. కనుక రాహుల్ గాంధీ కేరళపై ప్రత్యేక దృష్టి పెట్టి, జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన లెఫ్ట్ ప్రభుత్వంపై దానికి సారధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై తీవ్ర విమర్శలు చేశారు.

ఇంతవరకు బాగానే ఉంది. కానీ పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్‌, లెఫ్ట్ పార్టీతో పొత్తులు పెట్టుకొంది. కనుక కేరళలో ఆ పార్టీపై కత్తులు దూసి, బెంగాల్‌లో దానితో కలిసి పనిచేస్తే ప్రత్యర్ధులకు కాంగ్రెస్ పార్టీని విమర్శించేందుకు మంచి అవకాశం లభిస్తుంది. కనుక రాహుల్ గాంధీ పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారాన్ని వాయిదావేసుకోక తప్పడం లేదు. కానీ ఏదో ఓ రోజున అక్కడకు వెళ్ళకా తప్పదు...లెఫ్ట్ పార్టీలతో చెట్టాపట్టాలేసుకొని ఎన్నికల ప్రచారంలో పాల్గొనక తప్పదు. కనుక ప్రత్యర్ధుల విమర్శలను భరించక తప్పదు. 


Related Post