ఏప్రిల్ 1 నుంచి మరికొన్ని రైళ్ళు షురూ

March 16, 2021


img

ఏప్రిల్ 1వ తేదీ నుంచి మరో 30 ప్రత్యేక రైళ్ళను నడిపించబోతునట్లు దక్షిణమధ్యరైల్వే శాఖ ప్రకటించింది. వాటిలో సికింద్రాబాద్‌-సిర్పూర్ కాగజ్‌నగర్-సికింద్రాబాద్‌, విశాఖపట్నం-లింగంపల్లి-విశాఖపట్నం, తిరుపతి-జమ్ముతావి-తిరుపతి తదితర రైళ్ళున్నాయి. 

సికింద్రాబాద్‌-సిర్పూర్ కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌ (ట్రైన్ నెంబర్: 12757) ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రతీరోజూ ఉదయం 8.20 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి ఆలేర్, జనగావ్, ఘన్‌పూర్, కాజీపేట, ఉప్పల్,జమికుంట, ఓదెల, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల్, రవీంద్రఖని, బెల్లంపల్లి మీదుగా  మధ్యాహ్నం 1.30 గంటలకు కాగజ్‌నగర్ చేరుకొంటుంది.  మళ్ళీ మర్నాడు కాగజ్‌నగర్ నుండి (ట్రైన్ నెంబర్: 12758) మధ్యాహ్నం 2.45 గంటలకు బయలుదేరి రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకొంటుంది. 

విశాఖపట్నం నుంచి లింగంపల్లి (ట్రైన్ నెంబర్: 02831), లింగంపల్లి నుంచి విశాఖ (ట్రైన్ నెంబర్: 02832) రెండు రైళ్ళను కూడా జూన్‌30 వరకు పొడిగిస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. విశాఖ నుంచి ట్రైన్ నెంబర్: 02831 ప్రతీరోజు ఉదయం 6.20 గంటలకు బయలుదేరి రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, నల్గొండ, సికింద్రాబాద్‌ మీదుగా రాత్రి 7.40 గంటలకు లింగంపల్లి చేరుకొంటుంది.

ట్రైన్ నెంబర్ 02832 లింగంపల్లిలో ప్రతీరోజు ఉదయం 6.15 గంటలకు బయలుదేరి రాత్రి 7.40కి విశాఖపట్నం చేరుకొంటుంది. వీటితో పాటు మరో 27 ప్రత్యేక రైళ్ళను కూడా నడిపించబోతున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది.


Related Post