శభాష్ ఇండియా: ఐఎంఫ్

January 16, 2021


img

భారత్ కరోనాపై పోరును ఐఎంఫ్ (అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ) అధ్యక్షురాలు క్రిష్టాలిన జార్జ్ ఇవా ప్రశంసించారు. భారత్‌లో జనాభా చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ కరోనాపై పోరులో ప్రధాని నరేంద్రమోడీ సారధ్యంలో భారత్‌ విజయం సాధించిందని ఆమె ప్రశంసించారు. కరోనా ప్రారంభంలోనే లాక్‌డౌన్‌ విధించి, కరోనా ఆంక్షలను కటినంగా అమలుచేయడం వలననే భారత్‌ అద్భుతమైన ఫలితాలు సాధించిందని ఆమె ప్రశంశించారు. కరోనా... లాక్‌డౌన్‌ కారణంగా దేశ ఆర్ధికవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపినప్పటికీ భారత్‌ ప్రభుత్వం తీసుకొన్న అనేక చర్యల వలన ఆర్ధికసంక్షోభంలో చిక్కుకోకుండా బయటపడగలిగిందని ఆమె ప్రశంశించారు. కనుక భారత్‌ ఆర్ధిక పరిస్థితి ఊహించిన దానికంటే మెరుగుగానే ఉందని ఆమె కితాబు ఇచ్చారు. ఈనెల 26వ తేదీన సమర్పించబోయే గ్లోబల్ ఎకానమీ అప్‌డేట్ నివేదికలో ప్రపంచదేశాలతో పాటు భారత్‌ ఆర్ధిక పరిస్థితిపై మరింత సమాచారం ఇవ్వనున్నారు.

కరోనా కట్టడి విషయంలో అమెరికావంటి అగ్రదేశాలు సైతం నేటికీ తడబడుతుంటే, 135 కోట్లకు పైగా జనాభా... దానిలో సగానికిపైగా నిరుపేదలు, నిరక్షరాస్యులు, మూడ నమ్మకాలు...వ్యవస్థలలో అలసత్వం, అవినీతి, దేశ ఆర్ధిక పరిమితులు వంటి అనేకానేక సమస్యలు కలిగి ఉన్న భారత్‌ అత్యంత సమర్ధంగా కరోనా మహమ్మారిని కట్టడి చేసి చూపించింది. కనుక నిజంగానే ఈ ప్రశంశలకు అర్హమైనదని భావించవచ్చు. 


Related Post