తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా జీవన్ రెడ్డి?

January 05, 2021


img

తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి కోసం పార్టీలో సీనియర్ నేతలు రచ్చరచ్చ చేసి పార్టీ పరువు తీయడంతో కాంగ్రెస్‌ అధిష్టానం ఆగ్రహించిందో ఏమో అందరూ ఒక్కసారిగా చల్లబడిపోయారు. ఇప్పుడు దాని గురించి పార్టీలో ఎవరూ మాట్లాడటం లేదు. కానీ తాజాగా పుట్టుకొచ్చిన ఓ పుకారుతో ఆశావాహులలో కలవరం మొదలైంది. సీనియర్ కాంగ్రెస్‌ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరును కాంగ్రెస్‌ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తాజా సమాచారం. రేవంత్‌ రెడ్డిని పార్టీలో సీనియర్లు వ్యతిరేకిస్తున్న కారణంగా, ఆయనకు పార్టీ ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగించి, సీనియర్లకు, కార్యకర్తలకు  ఆమోదయోగ్యుడైన జీవన్ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా నియమిస్తే ఎలా ఉంటుందని కాంగ్రెస్‌ అధిష్టానం యోచిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొత్త పిసిసి అధ్యక్షుడిగా ఎవరిని ఎంపిక చేయాలనేదానిపై నేడు సోనియా, రాహుల్ గాంధీలు ఢిల్లీలో పార్టీ సీనియర్ నేతలతో సమావేశమయ్యి చర్చించబోతున్నట్లు సమాచారం. 

పార్టీలో అందరికీ ఆమోదయోగ్యుడైన వ్యక్తినే అధ్యక్షుడిగా నియమించవలసిన అవసరం ఉంది కానీ టిఆర్ఎస్‌, బిజెపిలను ఢీకొని పార్టీని గెలిపించుకోగల సామర్ధ్యం కూడా కలిగి ఉండాలి లేకుంటే ఎవరు అధ్యక్ష పదవి చేపట్టినా ఎటువంటి ప్రయోజనం ఉండబోదు.


Related Post