సీతక్క ప్రశ్న: ఇంకా ఎంతకాలం మమ్మల్ని కొత్తవాళ్ళని అంటారు?

December 28, 2020


img

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క ఆదివారం భద్రాచలానికి వచ్చి అక్కడ శ్రీ సీతారామచంద్రస్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, “నేను, రేవంత్‌ రెడ్డి, మా అనుచరులు కాంగ్రెస్ పార్టీ చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు పార్టీలో చేరి, అప్పటి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తూనే ఉన్నాము. పార్టీ తరపున టిఆర్ఎస్‌, బిజెపిలతో గట్టిగా పోరాడుతూనే ఉన్నాము. కానీ పదవుల విషయం వచ్చేసరికి పార్టీలో కొందరు సీనియర్లు మేము కొత్తగా పార్టీలో చేరామని వాదిస్తూ మా గురించి చాలా అనుచితంగా మాట్లాడుతున్నారు. వారు ఈవిధంగా మాట్లాడటం నాకు చాలా బాధకలిగిస్తోంది. అయినా ఇంకా ఎంతకాలం మమ్మల్ని పార్టీలో పరాయివారిగా చూస్తారు? ఇంకా ఎప్పటికీ మమ్మల్ని పార్టీనేతలుగా పరిగణిస్తారు?మేము కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకొన్నప్పుడు ఇప్పుడు మమ్మల్ని విమర్శిస్తున్నవారితో సహా సోనియా, రాహుల్ గాంధీలు మాకు సాధారంగా పార్టీలోకి స్వాగతం పలికారు. కానీ ఇప్పుడు ఎందుకు మమ్మల్ని అంటరానివారిగా చూస్తున్నారు? పార్టీలో సీనియర్లు మాపట్ల ఈవిదంగా వ్యవహరిస్తుండటం మాకు చాలా బాధ కలిగిస్తోంది. ఇకనైనా మమ్మల్ని కూడా పార్టీలో అందరితో సమానంగా చూసి గౌరవించాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు. 


Related Post