టిఆర్ఎస్‌ ఎంపీలతో సిఎం కేసీఆర్‌ ఢిల్లీలో ధర్నా...చేయాలి

December 25, 2020


img

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. ఇవాళ్ళ ఆయన మీడియాతో మాట్లాడుతూ,  రైతుల పక్షపాతి అని చెప్పుకునే కేసీఆర్ ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమాలకు ఎందుకు మద్దతు తెలపడం లేదని ప్రశ్నించారు. ఢిల్లీకి వెళ్లిన సీఎం రైతులను ఎందుకు కలవలేదని ప్రశ్నించారు. ఢిల్లీకి వెళ్లినప్పుడు సీఎం కేంద్ర ప్రభుత్వం ముందు మోకరిల్లారని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. సిఎం కెసిఆర్ నిజంగా రైతు పక్షపాతే అయితే టిఆర్ఎస్‌ ఎంపీలతో కలిసి ఢిల్లీలో ధర్నా చేసి ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతు తెలపాలని డిమాండ్ చేశారు. 

ప్రధాని నరేంద్రమోడీ-కేసీఆర్‌ల మద్య మంచి అవగాహన ఉందనే విషయం సిఎం కేసీఆర్‌ తాజా ఢిల్లీ పర్యటనతో మరోసారి నిరూపితమైందన్నారు. ఒకవేళ టిఆర్ఎస్‌-భాజాపాలమద్య ఎటువంటి సంబందాలు లేకపోతే సీఎం కేసీఆర్‌ అవినీతిపై సిబిఐ  విచారణ జరపాలని కేంద్రప్రభుత్వాన్ని కోరాలని పొన్నం ప్రభాకర్ రాష్ట్ర బిజెపి నేతలకు సవాల్ విసిరారు.

కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ చట్టాలను టిఆర్ఎస్‌ పార్లమెంటులోనే గట్టిగా వ్యతిరేకించింది. ఆ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన భారత్‌ బంద్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ పాల్గొన్నారు కూడా. కానీ సిఎం కేసీఆర్‌ ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ ఆందోళన చేస్తున్న రైతు సంఘాల నేతలను కలవకుండానే తిరిగివచ్చేశారు. బంద్‌లో పాల్గొనప్పుడు వ్యవసాయచట్టాలను వ్యతిరేకిస్తూ చాలా గట్టిగా మాట్లాడిన టిఆర్ఎస్‌ మంత్రులు ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు! అంటే అర్ధం ఏమిటో?


Related Post