 
                                        ఒక్కోసారి అధికారులు లేదా ప్రజాప్రతినిధుల అత్యుత్సాహంతోనో అనాలోచితంగానో మాట్లాడే మాటలు ప్రభుత్వాలకు ఇబ్బందికరంగా మారుతుంటుంది. మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రకృతివనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జడ్చర్ల టిఆర్ఎస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ప్రజలను మంచోళ్లనాలా... అమాయకులనాలా...అర్ధంకాని పరిస్థితి నెలకొంది. పనికిరాని భావోద్వేగాలకు లోనవుతుంటారు. ప్రభుత్వం ఎంత మంచి చేస్తున్నా ప్రజలకు మరిచిపోయే అలవాటుంది. నేను ఓ మాట చెపుతా. 24 గంటల కరెంట్ బంద్ చేద్దాం...మళ్ళీ పాత పద్దతిలోనే రోజుకు 3-4 గంటలు ఇద్దాం. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పధకాలన్నిటినీ కూడా ఓ ఏడాదిపాటు నిలిపేద్దామని సిఎం కేసీఆర్‌ను అడుగుదామనుకొంటున్నాను. మళ్ళీ ఎన్నికలకు ముందు ప్రారంభింద్దామని చెపుతాను. అప్పుడు ప్రజలు కూడా మా పార్టీని బాగా గుర్తుపెట్టుకొంటారు,” అని అన్నారు.