14.jpg) 
                                        సిఎం కేసీఆర్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ తిరిగిరాగానే హడావుడిగా 50,000 ఉద్యోగాలు భర్తీ చేయాలని అధికారులను ఆదేశించడంపై తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం స్పందిస్తూ, “సిఎం కేసీఆర్ త్వరలో జరుగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే ఉద్యోగాల భర్తీ చేస్తామని చెపుతున్నారు. ఇది ఎన్నికల కోసం మొదలుపెట్టిన సరికొత్త డ్రామా. సిఎం కేసీఆర్‌కు నిజంగా చిత్తశుద్ది ఉంటే ఈ నెలాఖరులోగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయించాలి. అయినా ఇంతవరకు జోనల్ వ్యవస్థపై ప్రభుత్వానికే స్పష్టత లేదు. ఉద్యోగాల భర్తీలో అనేక సమస్యలు ఎదురవడం ఖాయం” అని అన్నారు.