.jpg) 
                                        ఇటీవల బిజెపిలో చేరిన విజయశాంతి సిఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షాలను కలవడంపై ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. నియంతృత్వ పోకడలుప్రదర్శించే సిఎం కేసీఆర్ ప్రజాస్వామ్యం ముందు తలవంచవక తప్పదు అంటూ సిఎం కేసీఆర్ కేంద్రహోంమంత్రి అమిత్ షాకు నమస్కారం పెడుతున్న ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
బిజెపి మహిళ నేత డికె.అరుణ నిన్న కామారెడ్డిలో జరిగిన ఓ సభలో మాట్లాడుతూ, "ఎన్నికల సమయంలో కేంద్రం మెడలువంచి నిధులు తెస్తాం అంటూ బీరాలు పలికే సిఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షాలకు వంగి వంగి వంగి దండాలు పెట్టి నిధులు ఇవ్వాలని కోరుతున్నారంటూ..." ఎద్దేవా చేశారు.
ప్రస్తుతం కాంగ్రెస్ నేతలందరూ పిసిసి అధ్యక్ష పదవి కోసం కీచులాటలతో తీరిక లేకుండా ఉన్నారు లేకుంటే వారు కూడా మోడీ-కేసీఆర్‌ల భేటీపై తమదైన శైలిలో విమర్శలు గుప్పించి ఉండేవారే.