 
                                        తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మళ్ళీ పెరుగుతోంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ బూత్‌లలో భౌతికదూరం, మాస్కులు వగైరా అన్ని జాగ్రత్తలు పాటించేలా చూసిన ఎన్నికల సంఘం, ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వేలాదిమంది ఎటువంటి జాగ్రత్తలు పాటించకపోయినా పట్టించుకోలేదు! నిత్యం ప్రజలకు సుద్దులు చెప్పే నేతలు సైతం కరోనా జాగ్రత్తలు పాటించలేదు! నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రాష్ట్రంలో మళ్ళీ కరోనా కేసులు పెరుగుతాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖకు తెలిసి ఉన్నప్పటికీ అది కూడా పట్టించుకోలేదు!
బహుశః ఆ నిర్లక్ష్యం కారణంగానే కావచ్చు మళ్ళీ రాష్ట్రంలో క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. మంగళవారం కొత్తగా 721 పాజిటివ్ కేసులు నమోదవడమే అందుకు తాజా నిదర్శనం. గ్రేటర్ ఎన్నికల తరువాత రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉంటుందని ముందే గ్రహించిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఎన్నికలు ముగిసినప్పటి నుంచి రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్యను రోజుకు 10-12,000కి పెంచింది. ఇది చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకోవడంగానే భావించవచ్చు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా హెల్త్ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో మంగళవారం నమోదైన కరోనా కేసుల వివరాలు:
| గత 24 గంటలలో నమోదైన కేసులు | 721 | 
| గత 24 గంటలలో కోలుకొన్నవారు | 753 | 
| రికవరీ శాతం  | 96.67 | 
| గత 24 గంటలలో కరోనా మరణాలు | 3 | 
| రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య | 1,480 | 
| రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు | 2,75,261 | 
| మొత్తం కోలుకొన్నవారి సంఖ్య | 2,66,120 | 
| మొత్తం యాక్టివ్ కేసులు | 7,661 | 
| ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నవారిసంఖ్య  | 5,576 | 
| గత 24 గంటలలో కరోనా పరీక్షలు | 51,402 | 
| ఇప్పటివరకు చేసిన పరీక్షల సంఖ్య  | 59,19,635 | 
| జిల్లా | 8-12-2020 | జిల్లా | 8-12-2020 | జిల్లా | 8-12-2020 | 
| ఆదిలాబాద్ | 5 | నల్గొండ | 31 | మహబూబ్‌నగర్ | 17 | 
| ఆసిఫాబాద్ | 8 | నాగర్ కర్నూల్ | 10 | మహబూబాబాద్ | 16 | 
| భద్రాద్రి కొత్తగూడెం | 26 | నారాయణ్ పేట | 0 | మంచిర్యాల్ | 27 | 
| జీహెచ్‌ఎంసీ | 123 | నిర్మల్ | 3 | ములుగు | 14 | 
| జగిత్యాల | 17 | నిజామాబాద్ | 18 | మెదక్ | 12 | 
| జనగామ | 9 | పెద్దపల్లి | 24 | మేడ్చల్ | 58 | 
| భూపాలపల్లి | 10 | రంగారెడ్డి | 51 | వనపర్తి | 2 | 
| గద్వాల | 0 | సంగారెడ్డి | 32 | వరంగల్ రూరల్  | 10 | 
| కరీంనగర్ | 37 | సిద్ధిపేట | 18 | వరంగల్ అర్బన్ | 47 | 
| కామారెడ్డి | 11 | సిరిసిల్లా | 9 | వికారాబాద్ | 9 | 
| ఖమ్మం | 32 | సూర్యాపేట | 21 | యాదాద్రి | 14 |