తెలంగాణలో ప్రతీ ఆదివారం కరోనా పరీక్షలు తగ్గించి చేస్తుండటంపై హైకోర్టు పలుమార్లు అభ్యంతరం చెప్పింది. “మనం ఆదివారం శలవు తీసుకొంటే కరోనా కూడా శలవు తీసుకొంటుందా?” అని వ్యంగ్యంగా ప్రశ్నించింది. అయినా రోజూ కంటే ఆదివారం తక్కువ పరీక్షలు చేస్తున్నారు. తక్కువ పరీక్షలు చేయడం వలన తక్కువ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
ఉదాహరణకు శుక్రవారం 41,991 పరీక్షలు చేయగా 753 కేసులు , శనివారం 46,280 పరీక్షలు చేయగా 805 కొత్త కేసులు నమోదయ్యాయి. కానీ నిన్న ఆదివారంనాడు 33,040 పరీక్షలు చేసినందున కేవలం 593 కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయి. అంటే పరీక్షలు పెరిగితే కేసుల సంఖ్య పెరుగుతోంది...తగ్గిస్తే కేసుల సంఖ్య తగ్గుతున్నట్లు స్పష్టమవుతోంది.
నిజానికి ఆదివారంనాడే ప్రజలు కూరగాయలు, మాంసాహారం కొనుకొనేందుకు భారీ సంఖ్యలో మార్కెట్లకు వెళుతుంటారు. అలాగే పార్కులు, షాపింగులకు వెళుతుంటారు. కనుక ఆదివారమే కరోనా వ్యాపించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కనుక ఆ రోజే మరిన్ని ఎక్కువ పరీక్షలు చేయాల్సిన అవసరం ఉంటుంది. కారణమేమిటో తెలియదు కానీ ప్రతీ ఆదివారం కరోనా పరీక్షల సంఖ్య తగ్గిపోతోంది. మళ్ళీ నిన్న కూడా అదే జరిగింది. నిజంగా కరోనా కేసులు తగ్గితే అందరికీ సంతోషమే కానీ పరీక్షలు తగ్గించి కరోనా తగ్గిందనుకొంటే అది ఆత్మవంచనే అవుతుంది కదా?
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా హెల్త్ బులెటిన్ ప్రకారం ఆదివారం 33 జిల్లాలలో నమోదైన కరోనా కేసుల వివరాలు:
| గత 24 గంటలలో నమోదైన కేసులు | 593 | 
| గత 24 గంటలలో కోలుకొన్నవారు | 1,058 | 
| రికవరీ శాతం  | 95.74 | 
| గత 24 గంటలలో కరోనా మరణాలు | 3 | 
| రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య | 1,458 | 
| రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు | 2,69,816 | 
| మొత్తం కోలుకొన్నవారి సంఖ్య | 2,58,336 | 
| మొత్తం యాక్టివ్ కేసులు | 10,022 | 
| ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నవారిసంఖ్య  | 7,946 | 
| గత 24 గంటలలో కరోనా పరీక్షలు | 33,040 | 
| ఇప్పటివరకు చేసిన పరీక్షల సంఖ్య  | 54,53,461 | 
| జిల్లా | 29-11-2020 | జిల్లా | 29-11-2020 | జిల్లా | 29-11-2020 | 
| ఆదిలాబాద్ | 5 | నల్గొండ | 21 | మహబూబ్‌నగర్ | 6 | 
| ఆసిఫాబాద్ | 0 | నాగర్ కర్నూల్ | 9 | మహబూబాబాద్ | 15 | 
| భద్రాద్రి కొత్తగూడెం | 12 | నారాయణ్ పేట | 1 | మంచిర్యాల్ | 15 | 
| జీహెచ్‌ఎంసీ | 119 | నిర్మల్ | 1 | ములుగు | 12 | 
| జగిత్యాల | 16 | నిజామాబాద్ | 18 | మెదక్ | 5 | 
| జనగామ | 3 | పెద్దపల్లి | 5 | మేడ్చల్ | 55 | 
| భూపాలపల్లి | 2 | రంగారెడ్డి | 61 | వనపర్తి | 1 | 
| గద్వాల | 9 | సంగారెడ్డి | 33 | వరంగల్ రూరల్  | 18 | 
| కరీంనగర్ | 40 | సిద్ధిపేట | 4 | వరంగల్ అర్బన్ | 39 | 
| కామారెడ్డి | 13 | సిరిసిల్లా | 17 | వికారాబాద్ | 1 | 
| ఖమ్మం | 21 | సూర్యాపేట | 166 | యాదాద్రి | 0 |