 
                                        రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ శనివారం రాంనగర్‌లో రోడ్ షోలో సంచలన వ్యాఖ్యలు చేశారు. “జీహెచ్‌ఎంసీ ఎన్నికలలొ బిజెపి చేతిలో టిఆర్ఎస్ ఓడిపోవడం ఖాయం. ఆ తరువాత టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేసీఆర్‌పై తిరుగుబాటు చేయడం ఖాయం. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం పడిపోవడం ఖాయం. మద్యంతర ఎన్నికలు జరుగడం ఖాయం,” అని జోస్యం చెప్పారు. 
రాష్ట్రంలో ఎప్పటికైనా అధికారంలోకి రావాలని బిజెపి కలలు కంటోంది కానీ ప్రభుత్వం కూలిపోవడం.. మధ్యంతర ఎన్నికలు జరుగడం వంటివన్నీ పగటికలలనే చెప్పాలి. ఎందుకంటే ఒకవేళ జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో టిఆర్ఎస్ ఓడిపోయినా, శాసనసభలో ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ ఉంది. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై, పార్టీ నేతలపై సిఎం కేసీఆర్‌కు పూర్తి పట్టుంది. అలాగే ఆయన నాయకత్వంపై వారికి కూడా అచంచలమైన విశ్వాసం ఉంది. కనుక ఈ ఎన్నికలలో ఓడిపోతే టిఆర్ఎస్‌కు, కేసీఆర్‌కు రాజకీయంగా పెద్ద ఎదురుదెబ్బ అవుతుంది తప్ప ప్రభుత్వం పడిపోయే అవకాశమే లేదు.