బాణాసంచా నిషేధం సరే...మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి?

November 12, 2020


img

ప్రభుత్వాలు తీసుకొనే నిర్ణయాలు ప్రజలకు మేలు కలిగించేవిగా ఉండాలనుకోవడం అత్యాశ కాదు. అందుకే దేశంలో తెలంగాణతో సహా కొన్ని రాష్ట్రాలలో దీపావళి పండుగ సందర్భంగా బాణాసంచా అమ్మకాలను, కాల్చడాన్ని నిషేధించాయి. బాణాసంచా కాల్చితే వాయు, శబ్ధకాలుష్యం పెరుగుతుంది. కరోనా తీవ్రత కూడా పెరిగే ప్రమాదం ఉంటుంది. కనుక ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని బాణాసంచా అమ్మకాలు, కాల్చడంపై నిషేదం విధించడాన్ని ఎవరూ తప్పుపట్టరు. అయితే ఇటువంటి సమస్య ఎదురవుతుందని దీపావళి పండుగ ముందురోజు వరకు ప్రభుత్వాలు తెలుసుకోకపోవడమే విచిత్రం. గ్రహించి ఉంటే బాణాసంచా తయారీ దశలోనే సదరు సంస్థలను అప్రమత్తం చేసినట్లయితే వారికి, వివిద రాష్ట్రాలలో వాటిని కొనుగోలుచేసే డిస్ట్రిబ్యూటర్లకు, రీటెయిల్ అమ్మకందారులకు ఇప్పుడు ఇంత కష్టం, నష్టం, దీపావళి రోజున కన్నీళ్ళు పెట్టుకొనే అవసరం ఉండేది కాదు. బాణాసంచా తయారీపైనే తమిళనాడులోని శివకాశిలో వేలాదికుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. బాణాసంచా అమ్మకాలు నిలిచిపోతే మళ్ళీ తయారుచేసే అవసరం ఉండదు కనుక వారందరూ రోడ్డునపడే ప్రమాదం ఉంది.



కాలుష్య నివారణకు ప్రభుత్వాలు కట్టుబడి ఉండాలనుకొంటే తప్పు కాదు. కానీ హటాత్తుగా ఇటువంటి నిర్ణయాలు అమలుచేయడమే తప్పు. ఇటువంటి నిర్ణయాలు తీసుకొనే ముందు ఈ బాణాసంచా పరిశ్రమపై ఆధారపడున్న లక్షలాదిమంది జీవితాల గురించి కూడా ఆలోచించి ఉంటే బాగుండేది. ప్రభుత్వాలు హడావుడిగా తీసుకొనే నిర్ణయాలతో సమాజంలో కొంతమందికి మేలు చేసి, మరికొంత మంది బతుకులు రోడ్డునపడేలా చేయడం సమంజసం కాదు.

బాణాసంచా వలన కాలుష్యం అరికట్టాలని ప్రభుత్వాలు కృతనిశ్చయంతో ఉంటే వాటిపై ఆధారపడి జీవిస్తున్నవారికి వేరే జీవనోపాధి మార్గం వెతుక్కొనేందుకు తగినంత సమయం, వీలైతే అవకాశాలు కల్పించడం కనీస బాధ్యత. ఇప్పటికే దేశంలో నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఇలా ఏదో ఓ పనులు చేసుకొంటూ భారంగా జీవితాలు వెళ్ళదీస్తున్నవారిని కూడా రోడ్డున పడేస్తే ఏమవుతుంది




Related Post