ఉపఎన్నికలలో దేశవ్యాప్తంగా బిజెపి హవా

November 11, 2020


img

దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలలో 59 శాసనసభ స్థానాలకు జరిగిన ఉపఎన్నికలలో అత్యధిక స్థానాలను బిజెపి గెలుచుకొంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 28 సీట్లకు 18 సీట్లు గెలుచుకొంది మరొక స్థానంలో ఆధిక్యంలో ఉంది. ఇక బిజెపి సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో 8 స్థానాలకు ఎన్నికలు జరుగగా అన్నీ బిజెపియే గెలుచుకొంది. అదేవిధంగా యూపీలో 7 స్థానాలకు 6 స్థానాలను గెలుచుకొంది. అలాగే మణిపూర్‌లో 5 స్థానాలలో 4, కర్నాటకలో 2స్థానాలను, తెలంగాణలోని దుబ్బాక స్థానాన్ని బిజెపి గెలుచుకొంది. అయితే ఒడిశాలో తన పట్టు పెంచుకొందామని బిజెపి విశ్వప్రయత్నాలు చేస్తున్నా ఫలించలేదు. ఆ రాష్ట్రంలోని 2 స్థానాలను అధికార బిజెడీయే గెలుచుకొంది. ఈ ఎన్నికలలో అన్ని రాష్ట్రాలలో కలిపి 59 స్థానాలలో బిజెపి 40 సీట్లు గెలుచుకొంది. 

ఎప్పటిలాగే కాంగ్రెస్ పార్టీ ఈసారి వెనుకబడిపోయింది. మధ్యప్రదేశ్-9, ఝార్ఖండ్-1, ఛత్తీస్ ఘడ్ -1, హర్యానా-1 కలిపి మొత్తం 12 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది.  



Related Post