దుబ్బాకలో చివరివరకు టిఆర్ఎస్‌, బిజెపిల మద్య పోటాపోటీ

November 10, 2020


img

దుబ్బాక ఉపఎన్నికల ఓట్ల లెక్కింపులో 15వ రౌండ్ వరకు బిజెపి, టిఆర్ఎస్‌లు పోటాపోటీగా సాగినా 16వ రౌండ్ నుంచి ప్రతీ రౌండ్‌లో టిఆర్ఎస్‌ ఆధిక్యత సాధిస్తుండటంతో 19వ రౌండ్ పూర్తయ్యేసరికి టిఆర్ఎస్‌ అభ్యర్ధి సోలిపేట సుజాత బిజెపి అభ్యర్ది రఘునందన్ రావుపై 425 ఓట్లు ఆధిక్యత సాధించారు. కానీ మళ్ళీ బిజెపి 20వ రౌండ్‌లో 240, 21వ రౌండ్‌లో 380 ఓట్లు ఆధిక్యం సాధించడంతో మొత్తంగా 620 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.     

ఇప్పటివరకు పూర్తయిన ఓట్ల లెక్కింపులో టిఆర్ఎస్‌-57,541 బిజెపి -58,161, కాంగ్రెస్‌-20,268ఓట్లు గెలుచుకొన్నాయి.  

ప్రస్తుతం చేగుంట మండలానికి చెందిన ఓట్ల లెక్కింపు జరుగుతోంది. కనుక దుబ్బాక ఉపఎన్నికల ఫలితాలలో చేగుంట మండలం అత్యంత కీలకంగా మారబోతోంది.  ఇంకా కేవలం 2 రౌండ్లు మిగిలున్నాయి. ఈ రెండు రౌండ్లలో మళ్ళీ టిఆర్ఎస్‌ అధిక్యం సాధిస్తుందా లేదా అనేది మరికొన్ని నిమిషాలలో తేలిపోనుంది. 


Related Post