 
                                        దుబ్బాక ఉపఎన్నికల ఓట్ల లెక్కింపులో మధ్యాహ్నం 2.15 గంటలకు 14వ రౌండ్ ముగిసేసరికి బిజెపి అభ్యర్ధి రఘునందన్ రావు తన సమీప ప్రత్యర్ధి టిఆర్ఎస్ అభ్యర్ధి సోలిపేట సుజాతపై 2,483 ఓట్లు ఆధిక్యంలో ఉన్నారు. మళ్ళీ 16వ రౌండ్‌లో టిఆర్ఎస్ ఆధిక్యం సాధించడంతో రెండు పార్టీల మద్య తేడా క్రమంగా తగ్గుతోంది. 16వ రౌండ్ పూర్తయ్యేసరికి బిజెపి ఆధిక్యత 1,734కి తగ్గిపోయింది. 16 రౌండ్లు లెక్కింపు పూర్తయినప్పటికీ రెండూ పార్టీలు నువ్వానేనా? అన్నట్లు ఒక్కో రౌండ్‌లో ఒక్కోటి ఆధిక్యం కనబరుస్తుండటంతో రెంటిలో ఏది గెలుస్తుందనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఇదే లెక్కన ఆధిక్యతలు కొనసాగితే ఏ పార్టీ గెలిచినా కేవలం 1-2000 ఓట్ల మెజార్టీతో మాత్రమే గెలువవచ్చు.    
| సమయం | టిఆర్ఎస్ | బిజెపి | ఆధిక్యం | కాంగ్రెస్ | 
| ఉ.9.15 | 0 | 341 ఓట్లు  | బిజెపి
   | 0 | 
| ఉ.9.42  | 5,357 | 6,492 | బిజెపి
   | 1,315 | 
| ఉ.10.50  | 10,371 | 13,055 | బిజెపి
   | 2,158 | 
| ఉ.11.22  | 16,517 | 13,497 | టిఆర్ఎస్
   | 2,724 | 
| మ.12.22   | 20,277 | 22,762 | బిజెపి
   | 4,003 | 
| మ.12.22   | 34,748 | 30,815 | టిఆర్ఎస్
   | 8,582 | 
| మ.1.30 | 32,715 | 36,745 | బిజెపి
   | 10,662 | 
| మ.2.00  | 35,539 | 41,514 | బిజెపి  | 12,658 | 
| మ.2.15 | 41,103 | 43,586 | బిజెపి  | 14,158 |