భారత్‌కు చేరిన మరో మూడు రఫేల్ యుద్ధ విమానాలు

November 05, 2020


img

భారత్‌-ఫ్రాన్స్ దేశాల యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందంలో భాగంగా ఫ్రాన్స్ నుంచి మరో మూడు రఫేల్ యుద్ధ విమానాలు బుదవారం రాత్రి 8.14 గంటలకు గుజరాత్‌లోని జామ్‌నగర్ ఎయిర్ బేస్‌కు చేరుకొన్నాయి. ఫ్రాన్స్ నుంచి బుదవారం ఉదయం బయలుదేరిన మూడు రఫేల్ యుద్ధ విమానాలు మద్యలో ఎక్కడా ఆగకుండా కేవలం 8 గంటల వ్యవధిలోనే భారత్‌ చేరుకొన్నాయి. సుమారు 7,364 కిమీ దూరాన్ని అంత తక్కువ సమయంలో అధిగమించడం ద్వారా రఫేల్ యుద్ధ విమానాల సత్తాను, వాటిని నడిపించిన భారత్‌ వాయుసేన పైలట్ల సత్తాను యావత్ ప్రపంచదేశాలకు...ముఖ్యంగా చైనా, పాకిస్థాన్‌లకు చాటి చెప్పినట్లయింది. రఫేల్ యుద్ధ విమానాలు మద్యలో ఫ్రాన్స్ వాయుసేనకు చెందిన విమానాల ద్వారా గాలిలోనే ఇంధనాన్ని నింపుకొన్నాయి. మూడు రఫేల్ యుద్ధ విమానాలు సురక్షితంగా భారత్‌ చేరుకొన్నట్లు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, భారత్‌ వాయుసేన అధికారికంగా ప్రకటించారు. 



వీటితో భారత్‌ వద్ద అత్యాదునాతనమైన, అత్యంత శక్తివంతమైన 8 రఫేల్ యుద్ధ విమానాలు సమకూరాయి. రూ.59,000 కోట్లు వ్యయంతో భారత్‌ మొత్తం 36 రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలుచేస్తోంది. మళ్ళీ వచ్చే ఏడాది మార్చిలోగా మరో 5 లేదా 8 రఫేల్ యుద్ధ విమానాలు భారత్‌కు చేరుకొనే అవకాశం ఉంది.


Related Post