ఢిల్లీలో టిఆర్ఎస్‌ కార్యాలయం నిర్మాణం

November 04, 2020


img

దేశరాజధాని న్యూఢిల్లీలో టిఆర్ఎస్‌ కార్యాలయం నిర్మించుకోబోతోంది. దీనికోసం స్థలం కేటాయించవలసిందిగా కోరుతూ వ్రాసిన లేఖపై కేంద్రప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. న్యూఢిల్లీలోని వసంత్ విహార్‌లో టిఆర్ఎస్‌ కార్యాలయం కోసం కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ 1,100 చదరపు మీటర్ల స్థలాన్ని కేటాయించింది. దీనికి సంబందించి భూమి పత్రాలను ఆ శాఖ అధికారులు మంత్రి ప్రశాంత్ రెడ్డికి  బుదవారం అందజేశారు. సిఎం కేసీఆర్‌ త్వరలోనే శంఖుస్థాపన చేసే అవకాశం ఉంది. 

దుబ్బాక ఎన్నికలలో కేంద్రప్రభుత్వంపై టిఆర్ఎస్‌ తీవ్ర విమర్శలు చేసింది. అలాగే రాష్ట్ర బిజెపి నేతలు కూడా టిఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. దుబ్బాకలో టిఆర్ఎస్‌-బిజెపిల మద్య భీకర యుద్ధం చూసినవారికి ఈ పరిణామం చాలా విచిత్రంగా అనిపించవచ్చు. దీని గురించి రేపు రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు ఏవిధంగా స్పందిస్తారో అందరూ ఊహించవచ్చు. ఏదిఏమైనప్పటికీ, సిఎం కేసీఆర్‌ జాతీయరాజకీయాలలోకి ప్రవేశించడానికి దీనిని శ్రీకారంగా భావించవచ్చు కూడా. ఎందుకంటే, జాతీయరాజకీయాలలో ఉన్న అన్ని పార్టీలకు ఢిల్లీలో పార్టీ కార్యాలయాలున్నాయి. ఇప్పుడు వాటి సరసన టిఆర్ఎస్‌ కూడా నిలువబోతోంది.


Related Post