కాంగ్రెస్‌ అభ్యర్ధి టిఆర్ఎస్‌లోకి జంప్!

October 09, 2020


img

దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ ఇవాళ్ళ పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పార్టీలో ఇద్దరు సీనియర్ నేతలు తూమకుంట నర్సింహారెడ్డి, మనోహర రావు తమ అనుచరులతో కలిసి శుక్రవారం సాయంత్రం మంత్రి హరీష్‌రావు సమక్షంలో టిఆర్ఎస్‌లో చేరిపోయారు. 

మొదట తూమకుంట నర్సింహారెడ్డి పేరునే ఖరారు చేసి, ఆ తరువాత టిఆర్ఎస్‌ నుంచి చెరుకు శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌లోకి వచ్చి చేరడంతో నర్సింహారెడ్డిని పక్కన పెట్టి ఆయనకు టికెట్ కేటాయించిన సంగతి తెలిసిందే. దాంతో నర్సింహారెడ్డి తీవ్ర ఆగ్రహంతో పార్టీని వీడారు. పార్టీ నిర్ణయాన్ని తప్పు పడుతూ మనోహరరావు కూడా ఆయనతో పాటు పార్టీని వీడి టిఆర్ఎస్‌లో చేరిపోయారు. ఈ సందర్భంగా వారిరువురు సుమారు 2,000 మంది అనుచరులతో భారీ ర్యాలీగా బయలుదేరివచ్చి టిఆర్ఎస్‌లో చేరిపోయారు. 

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇద్దరు ముఖ్యనేతలు, ఇంత భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పార్టీని వీడటం కాంగ్రెస్‌కు చాలా నష్టం కలిగించవచ్చు. అయితే ఇటువంటి పరిణామాలకు సిద్దపడే రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు చెరుకు శ్రీనివాస్ రెడ్డికి టికెట్ కేటాయించి ఉంటారు కనుక ఉపఎన్నికలలో ఏవిధంగా ముందుకు సాగుతారో... విజయం సాధించాలరో లేదో తెలియాలంటే మరో నెలరోజులు ఎదురుచూడవలసిందే. ఎన్నికలు జరిగేలోగా ఇటువంటి అనూహ్య పరిణామాలు ఇంకా ఎన్ని జరుగుతాయో చూడాలి.


Related Post