దుబ్బాక ఉపఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్ధిగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి పేరును ఆ పార్టీ అధిష్టానం గురువారం సాయంత్రం ప్రకటించింది. శ్రీనివాస్ రెడ్డికి టిఆర్ఎస్‌లో టికెట్ లభించకపోవడంతో ఆ పార్టీకి గుడ్-బై చెప్పి కాంగ్రెస్‌లో చేరి సీనియర్ కాంగ్రెస్ నేత దామోదర రాజనరసింహ మద్దతుతో టికెట్ సంపాదించుకొన్నారు. ఈ ఉపఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్ధిని గెలిపించుకోవడానికి పార్టీలో సీనియర్లు అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు.
అయితే ఇల్లలకగానే పండుగ కాదన్నట్లు ఒకవేళ ఈ ఉపఎన్నికలలో శ్రీనివాస్ రెడ్డి గెలిస్తే కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారా లేక మళ్ళీ టిఆర్ఎస్‌లో చేరిపోతారా?అనేది ఎన్నికలు ఫలితాలు వెలువడితే కానీ తెలీదు. ఒకవేళ ఆయన గెలిస్తే టిఆర్ఎస్‌లోకి వెళ్ళిపోయినా ఆశ్చర్యం లేదు కానీ ఓడిపోతే మాత్రం తప్పకుండా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగవచ్చు. ఎందుకంటే టిఆర్ఎస్‌పై తొడకొట్టి సవాలు చేసి కాంగ్రెస్‌అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోతే, టిఆర్ఎస్‌లో ఇదివరకు లభించినంత గౌరవం కూడా లభించదు కనుక.