రఘునందన్ రావుకి టికెట్ ఇవ్వడం పెద్ద పొరపాటు

October 07, 2020


img

దుబ్బాక ఉపఎన్నికలకు రఘునందన్ రావును బిజెపి అభ్యర్ధిగా ప్రకటించగానే పార్టీలో అసమ్మతి సెగలు మొదలయ్యాయి. దుబ్బాక ఉపఎన్నికలలో పోటీ చేయాలనుకొన్న బిజెపి నేత కమలాకర్ రెడ్డి పార్టీ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దుబ్బాకలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “నేను ఎంతోకాలంగా బిజెపిని బలోపేతం చేసేందుకు కృషిచేస్తున్నాను. కానీ అక్రమాలతో డబ్బు సంపాదించిన రఘునందన్ రావు వంటి ఓ అవినీతిపరుడికి టికెట్ కేటాయించడం పార్టీకే అప్రదిష్ట. ఆయన గురించి దుబ్బాక ప్రజలలో చెడు అభిప్రాయం కలిగి ఉన్నందున ఎన్నికలలో గెలవలేరు. ఖచ్చితంగా గెలుచుకోగల అవకాశమున్న ఈ ఉపఎన్నికలలో రఘునందన్ రావును బరిలో దింపడం చాలా పెద్ద తప్పు. ఆయన ఓడిపోవడం ఖాయం. దాని వలన పార్టీ ఓ మంచి అవకాశం పోగొట్టుకొన్నట్లవుతుంది. కనుక ఆయన అభ్యర్ధిత్వంపై పునరాలోచించవలసిందిగా రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌కు విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు. 

టికెట్ లభించనప్పుడు పార్టీలో ఇటువంటి అసమ్మతి మామూలే కానీ ‘పార్టీ అభ్యర్ధి అవినీతిపరుడు, మహిళలను లోబరుచుకొంటాడని’ పార్టీలో నాయకుడే ఎన్నికలకు ముందు తీవ్ర ఆరోపణలు చేస్తుంటే ప్రజలు ఓట్లేస్తారా?    



Related Post