అక్టోబర్ 15 నుంచి తెరుచుకోనున్న సినిమాహల్స్

October 01, 2020


img

నేటి నుంచి అన్‌లాక్‌-5 మొదలైనందున కేంద్రప్రభుత్వం మళ్ళీ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ నెల 15వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా కంటెయిన్మెంట్ జోన్ల బయట ఉన్న సినిమా హాల్స్, మల్టీప్లెక్స్, వినోద పార్కులు, వ్యాపార ప్రదర్శనలు (ఎగ్జిబిషన్స్)లను అనుమతిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. మల్టీప్లెక్స్, సినిమా హాల్స్‌లో 50 శాతం సీటింగ్‌కు మాత్రమే అనుమతిస్తున్నామని చెప్పింది. స్విమ్మింగ్ ఫూల్స్‌లో కేవలం స్విమ్మింగ్ క్రీడాకారుల కోసమే ప్రారంభించేందుకు అనుమతిస్తున్నట్లు తెలిపింది. స్విమ్మింగ్ ఫూల్స్‌కు క్రీడలశాఖ, ఎగ్జిబిషన్ నిర్వహణకు వాణిజ్యశాఖ, పార్కులకు కుటుంబ ఆరోగ్యశాఖలు  త్వరలోనే వేర్వేరుగా మార్గదర్శకాలు విడుదల చేస్తాయని కేంద్రం తెలిపింది. 

పాఠశాలలు, కాలేజీలు తదితర విద్యాసంస్థలు ఎప్పుడు తెరవాలనేది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో కరోనా తీవ్రత, పరిస్థితులను బట్టి స్వయంగా నిర్ణయించుకోవచ్చునని తెలిపింది. కేంద్రం అనుమతించిన కొన్ని ప్రత్యేక విమానాలను తప్ప అంతర్జాతీయవిమానయాన సేవలపై నిషేదం కొనసాగుతుందని కేంద్రం తెలిపింది.      



Related Post