కొవీషీల్డ్ వ్యాక్సిన్‌ క్లినికల్ ట్రయల్స్‌లో ఆటంకం

September 09, 2020


img

కరోనా సోకకుండా అడ్డుకొనేందుకు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనికా కంపెనీలు కలిసి కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్‌ను తయారుచేశాయి. భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా పలుదేశాలలో దాని క్లినికల్ ట్రయల్స్‌ జోరుగా సాగుతున్నాయి. కోవిషీల్డ్ క్లినికల్ ట్రయల్స్‌లో ఇప్పటివరకు ఎటువంటి సమస్య తలెత్తకుండా అత్యంత కీలకమైన 3వ దశకు చేరుకోవడంతో ప్రపంచదేశాల ప్రజలందరూ కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. 

కానీ 3వ దశ క్లినికల్ ట్రయల్స్‌లో ఓ చిన్న అవాంతరం వచ్చింది. బ్రిటన్‌లో ఓ వాలంటీరుకు కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను ఇవ్వగా అది వికటించడంతో 3వ దశ క్లినికల్ ట్రయల్స్‌ తాత్కాలికంగా నిలిపివేశామని ఆస్ట్రాజెనికా సంస్థ స్వయంగా మంగళవారం ప్రకటించింది. అయితే క్లినికల్ ట్రయల్స్‌లో ఇటువంటి పరిణామాలు ఎదురవుతుండటం సర్వసాధారణమైన విషయమేనని, 3వ దశ ప్రయోగ ఫలితంపై లోతుగా విశ్లేషించి, ఏవైనా లోపాలున్నట్లయితే వారిని సరిదిద్దుకొని ముందుకు సాగుతామని ఆ సంస్థ ప్రతినిధి చెప్పారు. అత్యుత్తమైన, ప్రభావంతమైన వ్యాక్సిన్‌ను అందజేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతునందున ప్రతీదశలో ఫలితాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నామని ఆ సంస్థ ప్రతినిధి చెప్పారు.   

భారత్‌లో సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా ఈ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయబోతోంది కనుక భారత్‌లో కూడా ఈ వ్యాక్సిన్‌ క్లినికల్ ట్రయల్స్‌ జోరుగా సాగుతున్నాయి.


Related Post