2021లో చంద్రయాన్-3: కేంద్రం

September 07, 2020


img

చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలు సాగించాలనుకొన్న ఇస్రోకు చంద్రయాన్-2 మిషన్ చివరి నిమిషంలో విఫలం అవడంతో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అయితే ఆ మిషన్‌లో భాగంగా ప్రయోగించిన ఆర్బిటర్ మాత్రం నేటికీ చంద్రుడి చుట్టూ తిరుగుతూ చాలా చక్కగా పనిచేస్తోంది. ఇస్రో శాస్త్రవేత్తలకు చంద్రుడికి సంబందించి చాలా విలువైన సమాచారం పంపిస్తూనే ఉంది. అదే వారి ఆశలకు మళ్ళీ ఊపిరి పోస్తోందని చెప్పవచ్చు. చంద్రయాన్-2 వైఫల్యంతో ఇస్రో శాస్త్రవేత్తలు చాలా నిరాశ చెందినప్పటికీ మళ్ళీ మరోసారి ప్రయోగానికి సిద్దమవుతున్నారు. 2021 మొదట్లోనే చంద్రయాన్-3 ప్రయోగించబోతున్నట్లు కేంద్ర సహాయమంత్రి జితేంద్ర సింగ్‌ మీడియాకు తెలియజేశారు. ఇదివరకు పంపిన ఆర్బిటర్ చక్కగా పనిచేస్తున్నందున ఈసారి చంద్రయాన్-3లో ఆర్బిటర్ లేకుండా లాండర్, రోవర్ మాత్రమే ఉంటాయని చెప్పారు. రోవర్ చంద్రుడి ఉపరితలంపై చక్రాల సాయంతో తిరుగుతూ పరిశోధనలు చేస్తూ ఆ వివరాలను చంద్రుడి చుట్టూ తిరుగుతున్న ఆర్బిటర్‌కు పంపిస్తే అది అక్కడి నుంచి ఇస్రోకు చేరవేస్తుంటుంది. రోవర్ చాలా సున్నితమైన యంత్రం కనుక దానిపై ఏమాత్రం ఒత్తిడి పడకుండా జాగ్రత్తగా చంద్రుడి ఉపరితలంపై దిగేందుకు లాండర్ ఉపయోగపడుతుంది.


Related Post