భారత్‌లో ఒకే రోజు 83,883 పాజిటివ్ కేసులు నమోదు!

September 03, 2020


img

భారత్‌లో గత 24 గంటలలో 11.70 లక్షల మందికి పరీక్షలు చేయగా వారిలో 83,883 మందికి కరోనా సోకినట్లు గుర్తించామని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 38,53,406కి చేరింది. దేశంలో శరవేగంగా కరోనా వైరస్‌ వ్యాపిస్తున్నప్పటికీ ఇప్పుడు చాలామంది త్వరగానే కోలుకొంటున్నారు. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 68,000 మంది కోలుకొన్నారు. ఇప్పటివరకు 29.70 లక్షలమంది కోలుకోగా 67,376 మంది చనిపోయారు. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 77.1 శాతం ఉండగా, మరణాల రేటు 1.7 శాతం ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం దేశంలో 8,15,538 యాక్టివ్ కేసులున్నాయి. వారిలో చాలామంది ఆసుపత్రులలో మిగిలినవారు తమ ఇళ్లలోనే ఉంటూ కరోనాకు చికిత్స పొందుతున్నారు.  

దేశంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాలు: 

రాష్ట్రం

మొత్తం కేసులు

యాక్టివ్ కేసులు

కోలుకొన్నవారి సంఖ్య

మృతుల సంఖ్య

మహారాష్ట్ర

8,25,739

2,02,048

5,98,496

25,195

ఆంధ్రప్రదేశ్‌

4,55,531

1,03,076

3,48,330

4,125

తమిళనాడు

4,39,959

52,380

3,80,063

7,516

కర్ణాటక

3,61,341

94,478

2,60,913

5,950

ఉత్తరప్రదేశ్

2,41,439

56,459

1,81,364

3,616

ఢిల్లీ

1,79,569

16,502

1,58,586

4,481

పశ్చిమ బెంగాల్

1,68,697

24,445

1,40,913

3,339

బిహార్

1,41,441

17,001

1,23,794

646

తెలంగాణ

1,33,406

32,537

1,00,013

856

అస్సాం

1,15,279

26,227

88,729

323

ఒడిశా

1,09,780

25,193

84,073

514

గుజరాత్‌

98,888

15,913

79,929

3,046

రాజస్థాన్

84,674

12,919

70,674

1,081

కేరళ

78,072

21,989

55,778

305

హర్యానా

68,218

12,622

54,875

721

మధ్యప్రదేశ్

66,914

14,337

51,124

1,453

పంజాబ్

56,989

15,629

39,742

1,618

ఝార్ఖండ్

44,862

14,677

29,747

438


Related Post