కాంగ్రెస్ నేతలు మల్లు రవి, రేవంత్ రెడ్డిలు శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాద బాధితులను పరామర్శించడానికి వెళుతుండగా దారిలో వెల్టూరు గేట్ సమీపంలో పోలీసులు వారిని అడ్డుకొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలకు, పోలీసులకు మద్య కాసేపు తీవ్ర వాగ్వాదం జరిగింది. ప్రస్తుతం అక్కడ సిఐడి విచారణ జరుగుతున్నందున ప్రమాదస్థలానికి ఎవరినీ అనుమతించడం లేదని, కానీ వారు అక్కడకు వెళ్ళేందుకు పట్టుబడుతుండటంతో అడ్డుకోక తప్పలేదని పోలీసులు తెలిపారు.
అనంతరం రేవంత్ రెడ్డి ట్విట్టర్‌లో సిఎం కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “ప్రతిపక్ష నేతలకు ఈ దుర్ఘటనలో బాధిత కుటుంబాలను పరామర్శించడానికి కూడా వీలులేదా? దారిలో పోలీసులను కాపలా పెట్టి మమ్మల్ని అడ్డుకోవలసిన అవసరం ఏమిటి? అసలు మేము అక్కడకు వెళ్ళి నిజానిజాలు తెలుసుకోవాలనుకొంటే సిఎం కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారు?” అని ట్వీట్ చేశారు.