భారత్‌లో కరోనా బారినపడినవారి సంఖ్య 26 లక్షలు దాటిపోయింది. గత 24 గంటలలో కొత్తగా 50,921 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అవడంతో వారితో కలిపి దేశంలో కరోనా బారినపడివారి సంఖ్య 2,47, 663కి చేరింది. గత 24 గంటలలో దేశవ్యాప్తంగా 941 మంది చనిపోవడంతో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 50,921కి చేరింది. అయితే కరోనా సోకి కొలుకొంటున్నవారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుండటం చాలా ఉపశమనం కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా 26 లక్షల మందికి కరోనా వైరస్ సోకగా వారిలో ఇప్పటివరకు 19,19,000 మంది కోలుకొన్నారని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. ఆదివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 57,000 మంది కోలుకొన్నారని తెలిపింది. దేశంలో రికవరీ రేటు 72.5 శాతానికి పెరిగినట్లు తెలిపింది.