కరోనా చికిత్సలో వినియోగించేందుకు ఇప్పటికే 5 కంపెనీలు ఐదు మందులను మార్కెట్లోకి విడుదల చేశాయి. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఎంఎస్ఎన్ కంపనీ కూడా ‘ఫావిపిరావిర్’ ను ‘ఫావిలో’ పేరుతో విడుదల చేసింది. 200 మిల్లీ గ్రాములుండే ఒక్కో మాత్ర ధరను రూ.33గా నిర్ణయించినట్లు ఆ గ్రూప్ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ ఎంఎస్ఎన్ రెడ్డి చెప్పారు. ఇప్పటికే ఓసెల్టామివిర్ పేరుతో 75 మిల్లీగ్రాముల క్యాప్సూల్స్‌ను విడుదల చేశామని, త్వరలో 400 మిల్లీ గ్రాముల ఫావిలో ట్యాబ్లెట్లను కూడా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. దేశంలో లక్షలాదిమంది కరోనా బారినపడుతున్నారు కనుక అందరికీ అందుబాటుధరలో నాణ్యమైన మందులను అందజేయాలనే ఉద్దేశ్యంతో వీటిని ఉత్పత్తి చేస్తున్నట్లు ఆ సంస్థ ఈడీ భరత్ రెడ్డి మీడియాకు తెలిపారు. ప్రస్తుతం బొల్లారం ప్లాంటులో దీనిని ఉత్పత్తి చేస్తున్నామని ఒకవేళ ఇంకా అవసరమైతే కొత్తూరులో ఉన్న యూని ట్‌లో కూడా ఉత్పట్టి చేస్తామని చెప్పారు. త్వరలోనే భారత్ కరోనా నుంచి పూర్తిగా విముక్తి పొందుతుందని ఆశిస్తున్నామని అన్నారు.