ఈ నెలాఖరుతో అన్‌లాక్-2 ముగిస్తుంది. కనుక ఆగస్ట్ 1 నుంచి మొదలయ్యే అన్‌లాక్-3కి కేంద్ర హోంశాఖ ఇవాళ్ళ మార్గదర్శకాలు జారీ చేసింది. ఇప్పటివరకు రాత్రిపూట కొనసాగుతున్న కర్ఫ్యూను ఆగస్ట్ 1 నుంచి పూర్తిగా తొలగించింది. స్కూళ్ళు, కోచింగ్ సెంటర్లు ఆగస్ట్ 31వరకు మూసి ఉంచాలి. సినిమా హాల్స్, స్విమ్మింగ్ ఫూల్స్ కూడా ఆగస్ట్ 31వరకు మూసి ఉంచాలి. మెట్రో, ఎంఎంటిఎస్ రైళ్ళపై నిషేదం కొనసాగుతుంది. అంతర్జాతీయ విమాన సేవలపై కూడా ఆగస్ట్ నెలాఖరు వరకు నిషేదం కొనసాగుతుంది. కంటైన్‌మెంట్ జోన్‌లలో ఆంక్షలు యధాతధంగా కొనసాగుతాయి. ఆగస్ట్ 5 నుంచి యోగా సెంటర్లు, వ్యాయామశాలలు తెరుచుకొనేందుకు అనుమతించింది.