త్వరలో భారత్‌ చేరుకొనున్న రాఫెల్ యుద్ధవిమానాలు

July 27, 2020


img

ఫ్రాన్స్ లోని డసాల్ట్ కంపెనీ తయారుచేస్తున్న రఫెల్ యుద్ధవిమానాలు ప్రపంచలోకెల్లా అత్యాధునికమైనవి, చాలా శక్తివంతమైనవిగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందాయి. భారత్‌ వాయుసేన కోసం కేంద్రప్రభుత్వం 2016లో 36 రఫెల్ యుద్ధవిమానాలను ఆర్డర్ చేసింది. వాటిలో మొదటి బ్యాచ్‌లో 5 రఫెల్ యుద్ధ విమానాలు ఎల్లుండి అంటే బుదవారం భారత్‌ చేరుకోనున్నాయి. ఇప్పటికే అవి ఫ్రాన్స్ నుంచి బయలుదేరి యూఏఈ చేరుకొన్నాయి. రేపు అర్ధరాత్రి దాటిన తరువాత అవి అక్కడి నుంచి బయలుదేరి ఆదే రోజున హర్యానా రాష్ట్రంలోని అంబాలా ఎయిర్ బేస్‌కు చేరుకొంటాయి. అనంతరం వాటిని అధికారులు భారత్‌ వాయుసేనకు అప్పగిస్తారు. 

ఇప్పటికే భారత్‌ వాయుసేనకు చెందిన కొందరు పైలట్లు ఫ్రాన్స్ దేశంలో రఫెల్ యుద్ధవిమానాలు నడపడంలో శిక్షణ పొందారు. ఇంతవరకు కాలంచెల్లిన యుద్ధవిమానాలతో నెట్టుకువస్తున్న భారత్‌ వాయుసేన ఈ యుద్ధవిమానాలను ‘గేమ్ ఛేంజర్’గా భావిస్తోంది. ఇకపై వీటితో పాక్‌, చైనాలకు భారత్‌ వాయుసేన చాలా ధీటుగా బదులివ్వగలదు. ఈ విమానాలు అణుబాంబులతో సహా ఒకేసారి 14 వేర్వేరు రకాల బాంబులను, క్షిపణులను మోసుకుపోగలవు. సుమారు 300 కిమీ దూరంలో ఉన్న శత్రులక్ష్యాలను గుర్తించి దాడి చేయగలదు. 

అంత ప్రేలుడు సామాగ్రితో బయలుదేరిన యుద్ధ విమానాలు చాలా ప్రమాదమైనవే కానీ శత్రువు ఎదురుదాడి చేసినప్పుడు వాటి బరువు కారణంగా గాలిలో విన్యాసాలు చేస్తూ పల్టీలుకొడుతూ తప్పించుకోవడం చాలా కష్టం. కానీ రఫెల్ యుద్ధవిమానాలు పూర్తి ప్రేలుడు సామర్ధ్యంతో గాలిలో విన్యాసాలు చేస్తూ తప్పించుకోగలవు. ఒకవేళ చైనా, పాకిస్థాన్‌ యుద్ధవిమానాలు భారత్‌లోకి ప్రవేశించాలనుకొంటే వాటి ముందు రెండే రెండు ఆప్షన్స్ ఉంటాయి. 1. రఫెల్ కంటపడగానే వెనక్కు పారిపోవడం. 2 పొరపాటున దాని ఎదుటపడితే నేల కూలడం.


Related Post