టాప్ టెన్ రాష్ట్రాలలో ఏపీ, తెలంగాణ!

July 27, 2020


img

అభివృద్ధిలో నెంబర్ 1 స్థానంలో ఉండటం ఏ రాష్ట్రానికైనా గర్వకారణమే కానీ కరోనా వైరస్ విషయంలో నెంబర్ 1 స్థానంలో ఉండటం ఎవరు మాత్రం ఇష్టపడతారు?ఎవరు ఇష్టపడినా పడకపోయినా ఏదో ఓ రాష్ట్రం నెంబర్ 1 స్థానంలో ఉండక తప్పదు. ఆ ఘనత మహారాష్ట్రకు దక్కింది. నెంబర్ 1 ఉన్నప్పుడు 2,3 కూడా తప్పక ఉంటాయి. అలాగే ‘టాప్ టెన్’ ర్యాంకులు కూడా ఉంటాయి. 3,75, 799 పాజిటివ్ కేసులతో మహారాష్ట్ర నెంబర్ 1 స్థానంలో నిలువగా దాని తరువాత స్థానాలలో వరుసగా తమిళనాడు (2,13,723), డిల్లీ 1,30,606), ఏపీ(96,298), కర్ణాటక(96,141), ఉత్తరప్రదేశ్‌ (66,988), పశ్చిమబెంగాల్ (58,718), గుజరాత్‌ (55,822), తెలంగాణ (54,059), బీహార్ (39,176) రాష్ట్రాలు నిలిచాయి. దేశంలో నమోదైన కేసులలో ఈ 10 రాష్ట్రాలలోనే 82.71 శాతం కేసులు అంటే సుమారు 11 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర కుటుంబ ఆరోగ్యశాఖ ప్రకటించింది.  

దేశవ్యాప్తంగా గత 24 గంటలలో 49,931 కొత్త కేసులు నమోదవడంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 14,35,453కి చేరింది. వారిలో ఇప్పటివరకు 9,17,567 మంది కోలుకోగా మరో 4,85, 114 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు దేశంలో 32,771 మంది కరోనాతో మృతి చెందారని కేంద్ర కుటుంబ ఆరోగ్యశాఖ ప్రకటించింది.


Related Post