మార్కెట్లోకి వైరస్ కిల్లర్ మెషీన్

July 25, 2020


img

ప్రస్తుతం కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రపంచదేశాలన్నీ రకరకాల మందులు, పరికరాలు వగైరా తయారుచేస్తున్నాయి. దక్షిణకొరియాకు చెందిన ఓ సంస్థ వైరస్ కిల్లర్ మెషీన్‌ను తయారుచేసింది. మన దేశంలో ఊర్జా క్లీన్ టెక్ సంస్థ దక్షిణకొరియా సంస్థతో ఒప్పందం చేసుకొని దేశంలో వాటిని తయారు చేస్తోంది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ శుక్రవారం ఈ ‘వైరస్ కిల్లర్‌’ యంత్రాన్ని హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఊర్జా క్లీన్ టెక్ సంస్థ వైస్‌ ప్రెసిడెంట్ విష్ణుభరద్వాజ్, మేనేజింగ్ డైరెక్టర్ మధుసూధనరావు తదితరులు పాల్గొన్నారు. ఇళ్ళు, కార్యాలయాలు, సినిమా హల్స్, ఫంక్షన్ హాల్స్...ఎక్కడైనా దీనిని ఉపయోగించుకోవచ్చునని ఆ సంస్థ వైస్‌ ప్రెసిడెంట్ విష్ణు భరద్వాజ్ తెలిపారు. ఈ యంత్రాన్ని ఏదైనా గది లేదా హాల్లో ఉంచి ఆన్‌ చేయగానే పరిసరాలలోని గాలిని లోపలకు పీల్చుకొని దానిలోని వైరస్‌ను నిర్మూలిస్తుందని చెప్పారు. అంటే వాయుకాలుష్య నివారణ యంత్రం పద్దతిలో పనిచేస్తుందనుకోవచ్చు. త్వరలోనే వీటిని మార్కెట్లోకి విడుదల చేస్తామని చెప్పారు. 



Related Post