ఏపీలో ఒకేరోజున 6,045 పాజిటివ్ కేసులు నమోదు

July 23, 2020


img

పొరుగు రాష్ట్రం ఏపీలో రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు శరవేగంగా పెరిగిపోతున్నాయి. బుదవారం ఒక్కరోజే ఏపీలో కొత్తగా 6,045 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా కేసుల సంఖ్య 68,818కి చేరింది. ఏపీలో కరోనా మరణాలు కూడా పెరిగిపోతున్నాయి. బుదవారం ఒక్కరోజే ఏపీలో 65 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 823కి చేరింది. సుమారు రెండు నెలలపాటు ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కానీ విజయనగరం జిల్లాలో 1,803 కేసులు 23 మరణాలు, శ్రీకాకుళం జిల్లాలో 3,215 కేసులు 39 మరణాలు సంభవించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దాంతో విజయనగరం, తిరుపతిలో రెండు వారాలు లాక్‌డౌన్‌ విధించారు. ప్రతీరోజు భారీగా కరోనా కేసులు నమోదవుతుండటంతో పలు జిల్లాలలో లాక్‌డౌన్‌ విధిస్తున్నారు. పలు జిల్లాలలో మార్కెట్లు, దుకాణాలు స్వచ్ఛందంగా మూసుకొని లాక్‌డౌన్‌ పాటిస్తున్నారు. ఏపీలో కరోనా జోరు చూస్తే త్వరలోనే లక్ష కేసులు నమోదవడం ఖాయంగా కనిపిస్తోంది. 

ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బుదవారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో వివిద జిల్లాలలో కరోనా కేసుల వివరాలు: 

 

 

  జిల్లా

గత 24 గంటలలో చనిపోయినవారి సంఖ్య

మొత్తం మరణాలు

గత 24 గంటలలో నమోదైన కేసులు

మొత్తం పాజిటివ్ కేసులు

మొత్తం యాక్టివ్ కేసులు

కోలుకొన్నవారి సంఖ్య

1

శ్రీకాకుళం

3

39

252

3,215

1,858

1,318

2

విజయనగరం

4

23

107

1,803

1,257

523

3

విశాఖపట్టణం

3

54

1,049

3,479

1,868

1,557

4

తూర్పుగోదావరి

7

82

891

8,647

5,768

2,797

5

పశ్చిమగోదావరి

8

58

672

4,986

2,799

2,129

6

కృష్ణా

10

118

151

4,252

1,679

2,455

7

గుంటూరు

15

78

842

6,913

3,960

2,875

8

ప్రకాశం

3

42

177

2,433

1,004

1,387

9

కడప

1

28

229

3,349

1,655

1,666

10

కర్నూలు

5

135

678

7,797

3,030

4,632

11

నెల్లూరు

1

22

327

3,010

2,000

988

12

చిత్తూరు

5

64

345

5,668

2,521

3,083

13

అనంతపురం

0

80

325

6,266

2,206

3,980

 

వలస కార్మికులు

0

0

0

2,461

149

2,312

 

విదేశాల నుంచి తిరిగివచ్చినవారు

0

0

0

434

9

425

 

మొత్తం

65

823

6,045

64,718

31,763

32,127


Related Post